Asianet News TeluguAsianet News Telugu

విదేశీ పర్యటనల్లో దానివల్లే సమస్య...లేదంటేనా : కోహ్లీ

స్వదేశంలో మంచి విజయాలు సాధిస్తున్నప్పటికి విదేశీ పర్యటనల్లో విఫలం కావడానికి బ్యాటింగే కారణమని అన్నారు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బౌలర్లు భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారని...కానీ బ్యాట్ మెన్సే ఆ స్థాయిలో రాణించడంలేదని అన్నారు. దీని వల్ల విదేశాల్లో జరిగే సీరిస్ లను కోల్పోతున్నట్లు కోహ్లీ తెలిపారు.

Virat kohli Press Meet After Winning the Test series
Author
Hyderabad, First Published Oct 15, 2018, 3:19 PM IST

స్వదేశంలో మంచి విజయాలు సాధిస్తున్నప్పటికి విదేశీ పర్యటనల్లో విఫలం కావడానికి బ్యాటింగే కారణమని అన్నారు టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. బౌలర్లు భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారని...కానీ బ్యాట్ మెన్సే ఆ స్థాయిలో రాణించడంలేదని అన్నారు. దీని వల్ల విదేశాల్లో జరిగే సీరిస్ లను కోల్పోతున్నట్లు కోహ్లీ తెలిపారు.

వెస్టిండిస్ తో హైదరాబాద్ లో జరిగిన రెండో టెస్ట్ లో గెలిచి సీరిస్ ను 2-0 తో టీంఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించారు. భారత జట్టు బౌలింగ్ వల్ల ఏ సమస్యా లేదని కానీ బ్యాటింగ్ విభాగమే కాస్త బలహీనంగా ఉందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే సీరిస్ లు కోల్పోడానికి బ్యాటింగే కారణమని అన్నారు.

స్వదేశంలో మాత్రం బ్యాట్ మెన్స్ బాగా ఆడుతున్నారు. కానీ విదేశీ సీరిస్‌లలో ఇదే విధంగా పరగులు సాధించలేకపోతున్నారు. ఈ ఒక్క విషయంలో మెరుగుపడితే భారత జట్టుకు తిరుగుండదని అన్నారు. ఇక బౌలర్లు స్వదేశంలో, విదేశాల్లోనూ టెస్టుల్లో 20 వికెట్లు తీయగల్గుతున్నారని కోహ్లీ తెలిపారు. 

వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో టీంఇండియా పూర్తి ఆదిపత్యాన్ని కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆటగాళ్లకపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు.     
 
Follow Us:
Download App:
  • android
  • ios