టెస్టుల్లో నంబర్‌వన్‌గా కోహ్లీ.... కెప్టెన్‌గా "చెత్త" రికార్డు

virat kohli is the new no.1 batsmen in tests
Highlights

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం అభిమానుల మనసు గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల దగ్గర పాతుకుపోయి మరో వికెట్ పడకుండా కోహ్లీ జట్టులో స్ఫూర్తిని నింపాడు

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం అభిమానుల మనసు గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల దగ్గర పాతుకుపోయి మరో వికెట్ పడకుండా కోహ్లీ జట్టులో స్ఫూర్తిని నింపాడు. ఈ ప్రదర్శన ద్వారా టీమిండియా సారథి టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి టెస్టుకు ముందు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929) పాయింట్లతో 32 నెలల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 పరుగులు చేసిన కోహ్లీ.. 31 పాయింట్లు సాధించి నెంబర్‌‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. టెస్టుల్లో నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీకి ఇదే తొలిసారి కాగా.. ఈ ఘనత అందుకున్న ఏడవ భారత క్రికెటర్.. ఇంతకు ముందు సచిన్, రాహుల్ ద్రావిడ్, గౌతం గంభీర్, సునీల్ గావస్కర్, సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ ఉన్నారు.

మరోవైపు కోహ్లీ ఒక చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో భారత్ ఓటమిపాలైంది. ఇంతకు ముందు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కెప్టెన్‌గా సెంచరీలు చేసిన ఐదు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఈ రికార్డును విరాట్ సమం చేశాడు.

loader