టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో కీమర్ రోచ్ బౌలింగ్ లో తొలి బంతికే కోహ్లీ పెవిలియన్ కి చేరాడు. వికెట్‌ కీపర్‌ హామిల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో ‘గోల్డెన్‌ డక్‌’ కావడం కోహ్లికి ఇది నాలుగోసారి. మొత్తం తొమ్మిదిసార్లు టెస్టుల్లో కోహ్లి డకౌట్‌ అయ్యాడు.

కాగా, వెస్టిండీస్‌కు టీమిండియా 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు భారత్‌ 168/4 స్కోరు వద్ద సెకండ్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు హనమ విహారి రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. రహానేతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహనే(64), విహారి(53) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విండీస్‌ 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.