విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్.. రైనా ఆల్ల్ టైం రికార్డు బద్దలుకొట్టి హిస్టరీ…
స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ మాయాజాలంతో చరిత్ర సృష్టించాడు. నాలుగు సార్లు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచి రికార్డ్ బద్దలు కొట్టాడు.

మరోసారి విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో చూపించాడు. ఆసియా కప్ 2023 సూపర్ 4లో దాయాది పాకిస్తాన్ కు టీం ఇండియా తన పవర్ చూపించింది. ఆసియా కప్ 2023 సూపర్ 4 కొలంబో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ ను 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్…ఆ తర్వాత బౌలింగ్లో రోహిత్ నేతృత్వంలో ఢంకా బజాయించింది.
అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో మరోసారి చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ పరుగుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్ పరుగుల్లో కూడా 12 ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి.
Asia Cup 2023: పాక్‌పై టీమిండియా అద్భుత విజయం.. రివెంజ్ కోసం రిజర్వు డే పెట్టి..
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లో అజేయ శతకాలతో చెలరేగిపోయారు. వీరిద్దరికీ ఓపెనర్లుగా ఉన్న శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మలు తోడయ్యారు. శుబ్ మన్ గిల్ 58 పరుగులు, రోహిత్ శర్మ 56 పరుగులతో దాయాది టీంని గుక్క తిప్పుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చినా పాకిస్తాన్ 32 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది.
పాకిస్తాన్ ఆటగాళ్లయిన రవూఫ్, నసీమ్ షా గాయాల కారణంగా బ్యాటింగ్ కి దిగకపోవడంతో 8 వికెట్లకే ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. ఇక భారత జట్టులోని బౌలింగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన సత్తా చాటాడు. స్పిన్ మాయాజాలంతో దాయాది జట్టును దెబ్బతీశాడు. 32 ఓవర్లలో 8 ఓవర్లు కుల్దీప్ యాదవ్ 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఈ 8 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ తో పాటు శార్థూల్ ఠాకూర్,బూమ్రా, హార్దిక్ పాండ్యా తలా ఓ వికెట్ ను తీశారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో మెరుపులు కురిపించాడు.సెంచరీతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకోవడంతో విరాట్ కోహ్లీ ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు.
కోహ్లీ కంటే ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా, నవ జ్యోత్ సింగ్ సిద్దుల పేరిట ఉండేది. సురేష్ రైనా, నవ జ్యోత్ సింగ్ సిద్దులిద్దరూ ఆసియా కప్ వన్డే టోర్నీ చరిత్రలో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా మూడుసార్లు నిలిచారు. వీరిద్దరిని అధిగమించి నాలుగో సారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకొని విరాట్ కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.