Virushka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులు.. పేరు కూడా పెట్టారుగా..

విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. 
 

virat kohli, anushka sharma blessed with baby boy kms

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ సినీ నటి అనుష్క శర్మ దంపతులకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. రెండో సంతానంగా ఈ దంపతులు బేబీ బాయ్‌కు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమకు కొడుకు పుట్టాడని తెలిపారు. ఈ జంట అప్పుడే బాబుకు పేరును కూడా పెట్టింది. బాబు పేరు అకాయ్‌గా ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్టు అనుష్క శర్మ వెల్లడించారు.

ఈ దంపతులకు 2021లో తొలి సంతానం కలిగింది. తొలి సంతానం వారికి ఆడ బిడ్డ పుట్టగా.. ఆమెకు వామికా అని పేరు పెట్టుకున్నారు. 

Also Read: Mangalagiri: వైసీపీలోకి ఆర్కే.. మంగళగిరిలో లోకేశ్ మళ్లీ ఓడిపోతాడు

ప్రేమ నిండిన మా మనస్సులతో.. అవధులు లేని సంతోషంతో మాకు మగ బిడ్డ జన్మించడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. వామికాకు సోదరుడు వచ్చేశాడు. మా జీవితాల్లో శుభ సందర్భంలో మీ ఆశీస్సులు, అభినందనలు కోరుకుంటున్నాం. అలాగే.. మా ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios