MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • Mangalagiri: వైసీపీలోకి ఆర్కే.. మంగళగిరిలో లోకేశ్ మళ్లీ ఓడిపోతాడు

Mangalagiri: వైసీపీలోకి ఆర్కే.. మంగళగిరిలో లోకేశ్ మళ్లీ ఓడిపోతాడు

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంతగూటికి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరిలో మళ్లీ నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని స్పష్టం చేశారు. 

1 Min read
Author : Mahesh K
Published : Feb 20 2024, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Alla Ramakrishna Reddy (Mangalagiri)

Alla Ramakrishna Reddy (Mangalagiri)

YSR Congress Party: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి వచ్చారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు ఆయన అయోధ్య రామిరెడ్డి, గంజి చిరంజీవిలతో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
alla rama krishna reddy

alla rama krishna reddy

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని వివరించారు. ఇప్పటికీ ఆయన ఆ మార్గాన్ని వదల్లేదని తెలిపారు. జగన్‌తోనే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. అందుకే తాను తిరిగి వైసీపీలోకి వచ్చినట్టు వివరించారు. 

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలతోపాటు తాను కూడా ఏపీ కాంగ్రెస్‌లో చేరుతానని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు కూడా. కానీ, ఇప్పుడు వైఎస్ షర్మిలకు, ఏపీ కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ బయటికి వచ్చారు. మళ్లీ వైసీపీలోకి చేరడంతో పార్టీ వర్గాల్లో హుషారు వచ్చింది. ఆర్కే మళ్లీ వైసీపీలోకి రావాలని క్యాడర్, స్థానిక నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.

34
alla ramakrishna reddy

alla ramakrishna reddy

తాను వైఎస్ఆర్ భక్తుడినని ఆర్కే స్పష్టం చేశారు. తాను షర్మిలమ్మ వద్దకే వెళ్లానని వివరించారు. కానీ, కాంగ్రెస్ పెద్దల్లోగానీ, ప్రతిపక్షాల్లో గానీ జగన్‌ను ఓడించాలనే ధ్యాస తప్ప రాష్ట్ర ప్రజల గురించి చర్చ లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిలో జగన్ ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి వైసీపీలోకి వచ్చినట్టు వివరించారు.

44
Alla Ramakrishna Reddy (Mangalagiri)

Alla Ramakrishna Reddy (Mangalagiri)

మూడోసారి వైసీపీ గెలిచి తీరుతుందని, మంగళగిరిలో లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని ఆర్కే కామెంట్ చేశారు. మంగళగిరిలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా తాను వారి గెలుపు కోసం కృషి చేస్తానని వివరించారు. ఇక్కడ ఒక బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని అన్నారు.

About the Author

MK
Mahesh K
నారా లోకేష్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Recommended image3
Now Playing
చెంచాగాళ్లెవరు లోకేష్ పై రెచ్చిపోయిన పేర్ని నాని | Perni Nani Sensational Comments on Nara Lokesh
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved