ఫిఫా వరల్డ్‌కప్‌ క్వార్టర్ ఫైనల్ మాజీల పోరుతో మొదలుకానుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా.. అయిదు గోల్స్ చేసి లీగ్ దశను విజయవంతంగా ముగించింది ఉరుగ్వే. మరోవైపు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించకుండా ఆస్ట్రేలియా, పెరూలపై గెలిచి.. డెన్మార్క్‌తో డ్రా చేసుకుంది ఫ్రాన్స్. అయితే బలమైన ఎటాకింగ్ ఆటగాళ్లున్న ఫ్రాన్స్‌ను.. దుర్భేధ్యమైన రక్షణ శ్రేణి ఉన్న ఉరుగ్వే ఏ మాత్రం డిఫెన్స్  చేయగలుగుతుందో చూడాలి.

ఫ్రాన్స్ ఆశలన్నీ యంగ్ స్ట్రైకర్ ఎంబపెపైనే.. మరో ఆటగాడు గ్రీజ్‌మన్ కూడా విజృంభిస్తే ఫ్రాన్స్‌ను అడ్డుకోవడం కష్టం. ఇక ఉరుగ్వే విషయానికి వస్తే.. స్టార్ స్లేయయర్ ఎడిన్సన్ కవానీ ఫిట్‌నెస్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కాకపోతే కెప్టెన్ డీగో గోడిన్, జోర్ గిమినెజ్, మార్టిన్ కాకరెస్, డీగో లక్సాల్ట్‌లతో పాటు గోల్ కీపర్ ఫెర్నాండోలతో కూడిన ఉరుగ్వే రక్షణ వలయాన్ని ఛేదించడం అంత సులభం కాదు.. ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండానే ఉరుగ్వే గ్రూప్ దశను దాటింది.

మొత్తం మీద ఎటాకింగ్‌కు, ఢిఫెన్స్‌కు మధ్య పోరుగా ఈ మ్యాచ్‌ను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ టోర్నీలో ఉరుగ్వే నాలుగుసార్లు, ఫ్రాన్స్ 3 సార్లు విజయం సాధించాయి. ఫ్రాన్స్ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.. ఇరు జట్లు ఏడు గోల్స్  కొట్టగా.. ఫ్రాన్స్ 4, ఉరుగ్వే 1 గోల్‌ను ప్రత్యర్థులకు సమర్పించుకున్నాయి. అన్నీ గణాంకాలను పరిశీలించిన మీదట.. ఉరుగ్వేకు 37.8 శాతం, ఫ్రాన్స్‌కు 62.2 శాతం విజయావకాశాలున్నాయి. కాగా , ఫిఫా ప్రపంచకప్‌లలో క్వార్టర్ ఫైనల్ చేరిన ఐదు సందర్భాల్లో ఫ్రాన్స్  నాలుగుసార్లు  సెమీస్‌కు దూసుకెళ్లింది. 

"