ముంబై: వెస్టిండీస్ పై జరుగుతున్న మూడు మ్యాచులో ట్వంటీ20 సిరీస్ ను ఇప్పటికే భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మూడో ట్వంటీ20కి ముగ్గురు కీలకమైన బౌలర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. పేసర్లు ఉమేష్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాలకు, చైనామన్ కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇవ్వనున్నారు. మూడో టీ20 శనివారం చెన్నైలో జరుగుతుంది.

ఆ మేరకు బిసిసిఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫిజికల్ కండీషన్ ఉత్తమంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ముగ్గురికి విశ్రాంతి కల్పించినట్లు బిసిసిఐ తెలిపింది. పంజాబ్ కు చెందిన మీడియా ఫాస్ట్ బౌలర్ సిదార్థ్ కౌల్ తుది జట్టులోకి రానున్నాడు.

మూడో ట్వంటీ20కి భారత జట్టు ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షాహబాజ్ నదీం, సిద్ధార్థ కౌల్