ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరితో ఒకరు విపరీతంగా పోటీపడ్డారు. నువ్వా నేనా అన్నట్లు పరుగుల వరద పారించారు. 

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి మరో సీనియర్ క్రికెటర్ లారా సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒకప్పుడు.. ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకరితో ఒకరు విపరీతంగా పోటీపడ్డారు. నువ్వా నేనా అన్నట్లు పరుగుల వరద పారించారు. వీరిద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయితే.. విండీస్‌ మాజీ క్రికెటర్‌ లారా సచిన్ కి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారట. ఎవరూ ఊహించని విధంగా చెప్పాపెట్టకుండా లారా తన ఇంటికి విచ్చేశాడని టెండుల్కర్ పేర్కొన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో లారాతో కలిసి దిగిన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.

భారత్‌ తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్‌ 53 సగటుతో 15,921 పరుగులు సాధించారు. లారా 11,953 పరుగులతో నిలిచారు. ఇక వన్డేల్లో సచిన్ పరుగులు 18,426 కాగా లారా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేశారు. క్రికెట్‌ ఘనతల పుస్తకంలో సచిన్‌ పేరుతో ఎన్నో ఘనతలు ఉండగా టెస్టుల్లో 400 పరుగులు చేసిన ఘనత మాత్రం లారాదే. ప్రస్తుతం వెస్టిండీస్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు 0-2తో క్లీన్‌స్వీప్‌ అయింది.