Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: పోరాడి ఓడిన భారత ఫెన్సర్ భవానీదేవి

భారత ఫెన్సింగ్ సంచలనం భవానీదేవి ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని సాధించిన భవానీదేవి తన నెక్స్ట్ రౌండ్ లో వరల్డ్ నెంబర్ 3చేతిలో ఓటమి చెందింది. 

Tokyo Olympics: Indian Fencer Bhavani Devi Bows Out
Author
Tokyo, First Published Jul 26, 2021, 8:37 AM IST

భారత ఫెన్సింగ్ సంచలనం భవానీదేవి ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని సాధించిన భవానీదేవి తన నెక్స్ట్ రౌండ్ లో వరల్డ్ నెంబర్ 3చేతిలో ఓటమి చెందింది. 

యువ భవానీదేవి ఓటమి చెందినప్పటికీ... ఒలింపిక్ ఫెన్సింగ్ యవనికపై భారత్ పేరును తొలిసారి పరిచయం చేసింది. ఫ్రాన్స్ కి చెందిన మనన్ బ్రునెట్ తో జరిగిన మ్యాచులో భవాని దేవి 15-7 తో ఓటమి చెందింది. 

ఏస్ ఫ్రెంచ్ సేబర్ కి అంత సునాయాసంగా విజయాన్నైతే దక్కనివ్వలేదు భవాని. ప్రతి పాయింట్ కోసం ఫ్రెంచ్ ఫెన్సర్ కష్టించావలిసి వచ్చింది. తొలి పీరియడ్ లో భవాని కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించింది. ఇక ఆ తరువాత ప్రత్యర్థిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. రివ్యూ తీసుకొని అక్కడ పాయింట్ సాధించడం ద్వారా ఆట మీద తనకున్న పట్టును అందరికి అర్థమయ్యేలా చేసింది. 

ఆ తరువాత 14-6 గా ఉన్న సమయంలో కూడా ప్రత్యర్థి ఒక పాయింట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా అది దక్కనివ్వలేదు భవాని. ఆ పరిస్థితుల్లో కూడా మరొక పాయింట్ ని సాధించింది. మ్యాచ్ లో తుదికంటా పోరాడి ఓడింది. భవాని దేవి మార్గంలో రానున్న కాలంలో మరింత మంది భారత ఫెన్సర్లు తయారయ్యేందుకు ఈ పునాది ఎంతగానో ఉపయోగపడనుంది. 

ఇక నేటి ఉదయం జరిగిన తొలి మ్యాచులో ట్యునీషియా కి చెందిన ఫెన్సర్ పై 14-3 తేడాతో విజయాన్ని నమోదు చేసి ఈ రౌండ్లోకి దూసుకొచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 42వ స్థానంలో ఉన్న భవానీదేవి... ప్రత్యర్థి నదియా పై గెలిచి భారత్ ను రెండవ రౌండ్ కి చేర్చింది. 

ఆట ప్రారంభమైన దగ్గరి నుండి ఎక్కడా కూడాప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించింది. తొలి పీరియడ్ పూర్తవడానికి 8 పాయింట్లు అవసరం కాగా... భవాని దేవి ప్రత్యర్థికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా 8-0 తో మొదటి పీరియడ్ ను ముగించింది. 

అంతకంతకు ప్రత్యర్థి మీద వరుస దాడులు చేస్తూ తన ఆధిపత్యాన్ని 13-1 కి పెంచుకుంది. చివరకు 15-3 తో గేమ్ ను ముగించింది. (మొదటగా 15 పాయింట్లు ఎవరు సాధిస్తే వారే విజేతలు) అలా తొలి రౌండ్ నెగ్గిన భవానీదేవి... ఇప్పుడు తన రెండవ రౌండ్లో ఫ్రాన్స్ కి చెందిన మానన్ బ్రునెట్ తో పోరాడి ఓడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios