Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: జపాన్ పై భారత హాకీ జట్టు విజయం

భారత హాకీ టీం నేడు జపాన్ తో తలపడ్డ మ్యాచులో 5-2 తో అద్భుత విజయాన్ని సాధించింది. 

Tokyo Olympics : India Mens Hockey Team beats Japan by 5-3
Author
Tokyo, First Published Jul 30, 2021, 4:49 PM IST

భారత హాకీ టీం నేడు జపాన్ తో తలపడ్డ మ్యాచులో 5-2 తో అద్భుత విజయాన్ని సాధించింది. అర్జెంటీనాపై గెలుపుతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ను కంఫర్మ్ చేసుకున్న హాకీ ఇండియా... నేడు మరో గెలుపుతో ఆస్ట్రేలియా తరువాత గ్రూప్ లో రెండవ స్థానం కోసం పోటీ పడుతుంది. 

మ్యాచ్ తొలి క్వార్టర్ ప్రారంభంలోనే హర్మన్ప్రీత్ అద్భుతమైన గోల్ తో భారత్ కి శుభారంభాన్ని అందించాడు. జపాన్ ప్లేయర్స్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా... భారత ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. ఇన్నర్ సర్కిల్ పెనట్రేషన్స్ లో కూడా భారత్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. భారత్ అధిక భాగంలో బాల ని తమ కంట్రోల్ లో ఉంచుకోవడంతో జపాన్ కి ఎక్కువ అవకాశం దక్కలేదు. 

రెండవ క్వార్టర్ ఆరంభంలోనే భారత్ మరో గోల్ ని సాధించి తమ ఆధిపత్యాన్ని 2-0 కి పెంచుకుంది. కానీ జపాన్ ప్లేయర్లు కూడా వెంటనే తమ రెండవ గోల్ ని సాధించారు. ఒక్క క్షణం ఏమరపాటుగా చేసిన మిస్ స్ట్రైక్ ని  జపాన్ ప్లేయర్లు పూర్తి స్థాయిలో వాడుకొని గోల్ చేసారు. కానీ భారత్ ప్లేయర్లు దాని ఇంపాక్ట్ వారి మీద పడకుండా చూసి 2-1 తో ఫస్ట్ హాఫ్ ని ముగించారు. 

ఇక మూడవ క్వార్టర్లో జపాన్ పుంజుకునే ప్రయత్నం చేసింది. జపాన్ ప్లేయర్లు అత్యంత వేగంగా కదులుతూ గోల్ ని సాధించడం ద్వారా 2-2 తో స్కోర్ ని సమం చేసారు. వారి ఆనందాన్ని ఎక్కువసేపు నిలువనీయకుండా... భారత ప్లేయర్లు వెంటనే మరో గోల్ మీ సాధించి 3-2 తో లీడ్ ని సాధించారు. నీలకంఠ అద్భుతమైన షాట్ ని షంషేర్ సింగ్ మరొక బ్యూటిఫుల్ డిఫ్లెక్షన్ తో ఈ గోల్ ని సాధించాడు. 

ఇక నాలుగవ క్వార్టర్లో భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి తొలి భాగంలోనే మరో గోల్ ని సాధించి లీడ్ ని 4-2 కి పెంచుకుంది. ఇక ఆతరువాత అందివచ్చిన పెనాల్టీ కార్నర్ ని వాడుకొని 5-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక చివర్లో జపాన్ మరో గోల్ ని సాధించి 5-3 కి లీడ్ ని తగ్గించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios