Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: ఏడాదిన్నరగా ఇంటికి దూరమయ్యా.. మీడియా సమావేశంలో పీవీ సింధు ఉద్వేగం

ఏడాదిన్నరగా కుటుంబానికి దూరంగా వున్నానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. 

tokyo olympics bronze medalist pv sindhu pressmeet in hyderabad ksp
Author
Hyderabad, First Published Aug 4, 2021, 5:13 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ  సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సింధూ.. ఏడాదిన్నరగా కుటుంబానికి దూరంగా వున్నానని ఆమె తెలిపారు.

Also Read:టోక్యో ఒలింపిక్స్: హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం, త్యాగం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పీవీ సింధు పేర్కొన్నారు. అమ్మానాన్న ఇద్దరూ కూడా క్రీడాకారులు కావడం వల్ల తాను అదృష్టవంతురాలినని.. చిన్నప్పటి నుంచి నాన్న ఎన్నో సలహాలు ఇచ్చేవారని ఆమె వెల్లడించారు. వాళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు కాబట్టే.. ఆ విషయాలు తనకు చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చారని సింధు అన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది క్రీడాకారులకు చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. త్వరలో పారిస్‌లో జరగబోయే టోర్నీలో పాల్గొంటానని సింధు వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios