హై జంప్ ఈవెంట్ ఫైనల్స్‌లో సంయుక్త విజేతలుగా నిలిచిన ఖతర్, ఇటలీ...గాయపడిన స్నేహితుడి కోసం స్వర్ణాన్ని షేర్ చేసుకునేందుకు అంగీకరించిన అథ్లెట్...

టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకే ఈవెంట్‌లో ఒకే పోటీలో ఇద్దరు స్వర్ణ విజేతలుగా నిలిచారు. హై జంప్ ఈవెంట్ ఫైనల్స్‌లో ఖతర్‌కి చెందిన ముతాజ్ ఎస్సా బర్షిమ్, ఇటలీకి చెందిన జిన్‌మార్కో తంబేరి సంయుక్త విజేతలుగా నిలిచారు.

నాలుగేళ్లుగా స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఒలింపిక్ ఫైనల్స్‌లో 2.38 మీటర్ల ఎత్తు ఎగిరి టాప్‌లో నిలిచారు. అప్పటికే మూడు గంటలకు సాగిన ఈ ఈవెంట్ ఫైనల్స్‌లో విన్నర్‌ని నిర్ణయించేందుకు మరో రౌండ్ నిర్వహించాలని భావించారు నిర్వహాకులు.

అయితే తంబేరికి గాయం కావడంతో బర్షిమ్, మూడు ప్రయత్నాల్లో 2.39 ఎత్తుకు దూకాల్సి ఉంటుంది. అతని ప్రత్యర్థికి గాయం కావడంతో బర్షిమ్‌ను మ్యాచ్ రిఫరీ, ‘మీరు పోటీ నిలుస్తారా? లేక తంబేరితో కలిసి గోల్డ్‌ను షేర్ చేసుకుంటారా’ అని ప్రశ్నించాడు.

Scroll to load tweet…

దానికి బర్షిమ్ ఏ మాత్రం ఆలోచించకుండా, తన స్నేహితుడితో గోల్డ్ పంచుకుంటానని చెప్పాడు. ఆ మాట ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైన తంబేరి, బర్షిమ్‌ను కౌగిలించుకుని ఏడ్చేశాడు.

గాయాన్ని కూడా మరిచిపోయి, ఎగిరి గంతులేసుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. ఈ బ్యూటీఫుల్ మూమెంట్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.