టోక్యో ఒలింపిక్స్: ఈ విజయం దేశానికి అంకితం... మీరాభాయ్ ఛాను ఎమోషనల్ ట్వీట్...

ఇది నా కల నిజమైన క్షణం... నా ఈ మెడల్‌ని నా దేశానికి అంకితం ఇస్తున్నా...

నన్ను నమ్మి, నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా మా అమ్మకి శతకోటి వందనాలు... 

ఒలింపిక్ విన్నర్ మీరాభాయ్ ఛాను ఎమోషనల్ ట్వీట్...

tokyo 2020: This medal dedicated to my country, mirabai chanu emotional tweet CRA

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి, భారత్‌‌కి తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను... తన విజయాన్ని దేశానికి అంకితం ఇచ్చింది. 48 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి, ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళా వెయిట్ లిఫ్టర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మీరాభాయ్ ఛాను... సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

‘ఇది నా కల నిజమైన క్షణం... నా ఈ మెడల్‌ని నా దేశానికి అంకితం ఇస్తున్నా. నేను పతకం సాధించాల్సిన ప్రార్థించిన వంద కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో భారతీయులందరూ నాకు తోడుగా ఉన్నారు. నన్ను నమ్మి, నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా అమ్మకి శతకోటి వందనాలు...

నాకు అండగా, సపోర్ట్ చేసిన భారత ప్రభుత్వం, క్రీడా శాఖ, స్పోర్ట్స్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్, వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, రైల్వేస్, స్పాన్సర్లు, ఓజీక్యూ, మార్కెటింగ్ ఎజెన్సీలకు కృతజ్ఞతలు.

నా కోచ్ విజయ్ శర్మకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి స్పెషల్ థ్యాంక్స్...  నన్ను ప్రోత్సహించి, నాలో స్ఫూర్తినింపిన ప్రతీ ఒక్కరికీ వందనాలు... జై హింద్’ అంటూ సుదీర్ఘమైన లేఖను పోస్టు చేసింది మీరాభాయ్ ఛాను..


టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి తొలి పతకాన్ని అందించిన మీరాభాను ఛానుకి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు, సినిమా నటీనటులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios