కమాన్ పాపా... ధోనీ ముద్దుల తనయ చీర్స్ (వీడియో)

This special cheer from the Super kings
Highlights

ఐపిఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తడాఖా చూపుతోంది. 

ఐపిఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తడాఖా చూపుతోంది. సూపర్ అనిపించుకుంటోంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈ ఆనందాన్ని ధోనీ ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తున్నాడు. 

దానికితోడు ధోనీ మూడేళ్ల కూతురు కూడా తండ్రికి తగిన తనయ అనిపించుకుంటోంది. ధోనీ తన సమయాన్ని తన ముద్దుల కూతురికి కూడా కొంత కేటాయిస్తున్నట్లే ఉన్నాడు. 

బ్లో డ్రైయింగ్ జీవా హెయిర్ సోషల్ మీడియాలో హిట్ అయింది. జీవా నృత్యం చేస్తున్న వీడియోను ధోనీ ఇనస్ట్రాగ్రాంలో పోస్టు చేశాడు. తన కూతురి డ్యాన్స్ కు ఫిదా అయిన ధోనీ కనీసం తండ్రి కన్నా కూతురు బెటర్ గా డ్యాన్స్ చేస్తోందనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 

అంతేకాకుండా, మైదానంలో తండ్రి బ్యాట్ ను ఝళిపిస్తుంటే జీవా చీర్స్ చెబుతూ కమాన్ పాపా అంటూ ఉత్సాహపరుస్తోంది.ల జీవా సురేష్ రైనా, హర్భజన్ సింగ్ కూతుళ్లతో స్నేహం చేస్తోంది. వారి మధ్య బంధం గట్టి పడుతుందని చెప్పడానికి రైనా జీవా, గ్రేసియా, హినాయా కలిసి ఆడుకుంటున్న వీడియోను ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశాడు.

ఇంటర్నెట్ డార్లింగ్ గా మారిపోయిన జీవా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

loader