తమిళపనాడులోని తిరువన్నామలై వేదికన జరుగుతున్న 17వ ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ లో అథ్లెట్ లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా షాట్ పుట్ లో జాతీయ స్థాయి రికార్డులు బద్దలవుతున్నాయి. డిల్లీ షాట్ పుటర్ ఫార్థ్ లక్రా ఏకంగా 18.01మీటర్ల దూరం విసిరి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక ఇదే విభాగంలో హర్యానా షాట్ పుటర్ దీపేంద్ర దబస్ 17.73మీటర్లలో రెండో స్థానంలో నిలిచాడు.  తెలంగాణ షాట్ పుటర్  సత్యవాన్ మాలిక్ 17.71మీటర్లతో మూడో స్ధానంలో నిలిచాడు. ఈ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ సెప్టెంబర్ 23-26 వరకు జరిగాయి. 

ఈ క్రీడల్లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన లక్రా మాట్లాడుతూ... ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్  సాధించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నాడు. అందుకోసం ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడివరకు చేరుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతానికయితే ఒలింపిక్స్ లో అర్హత సాధించే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపాడు. ఆసియన్ గేమ్స్ 2018 లో షాట్ పుట్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన తేజిందర్ సింగ్ తోమర్ తనకు స్పూర్తినిచ్చిన ఆటగాడని లక్రా తెలిపాడు.