ప్రతిభ ఉంటే చాలు.. పరాయి ప్లేయర్స్ అయినా పర్లేదు..!

Teams acquiring best players from outside also
Highlights

ప్రతిభ ఉంటే చాలు.. పరాయి ప్లేయర్స్ అయినా పర్లేదు..!

హైదరాబాద్: అర్జునుడు పక్షి కంటిని లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రపంచంలో ఫుట్‌బాల్ టీమ్స్ అన్నీ కూడా గెలుపే లక్ష్యంగా మైదానంలో కదం తొక్కుతుంటాయి. ఆ క్రమంలో గోల్స్ సాధించడంలో ఘనాపాఠి అయితే చాలు అలాంటి ఆటగాడి జాతి, దేశం, ప్రాంతం, వర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా టక్కున అక్కున చేర్చుకుంటున్నాయి. వివక్ష అన్న మాట ఇలాంటి టీమ్స్‌ డిక్షనరీలో కలికం పెట్టి వెదికినా కనిపించదు. ఇలా అద్భుతమై ప్రతిభతో వేరే ప్రాంతాలకు చెందిన టీమ్స్‌లో అగ్ర తాంబూలం దక్కించుకున్న వారికి పరాయి ఆటగాళ్ళు అని నామకరణం చేసినట్టయితే, వారి తాలూకు పూర్తి వివరాలు తాజా స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది.
12,425 మంది ప్లేయర్స్.. 2,235 టీమ్స్
స్విట్లర్లాండ్‌కు చెందిన ఒకానొక రీసెర్చ్ గ్రూప్ సిఐఇఎస్ ఫుట్‌బాల్ అబ్జర్వేటరీ ప్రపంచవ్యాప్తంగా పరాయి ఆటగాళ్ళ లెక్క తేల్చడానికి గ్లోబల్ స్టడీ చేసింది. 
ఆ స్టడీ ప్రకారం మే నెల ఒకటవ తేదీ నాటికి మొత్తం 12,425 పరాయి ఆటగాళ్ళు 93 దేశాలకు చెందిన 142 లీగుల్లో 2,235 టీమ్స్ కోసం ఆడుతున్నారు. అలా చూసినప్పుడు టీమ్‌కు ఎంత లేదన్నా ఆ తరహా ప్లేయర్స్ దాదాపు 5.6 మంది ఉన్నారు. అలాగే సగటు వయస్సు 26.8 సంవత్సరాలు. యూరోపియన్ టీమ్స్ యువ ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. అంటే ఈ టీమ్స్‌లో పరాయి ఆటగాళ్ళ సగటు వయస్సు దాదాపు 26.3 సంవత్సరాలు. అయితే ఆసియా టీమ్స్ మాత్రం అనుభవానికి పెద్ద పీట వేస్తున్నాయి. సగటు వయస్సు దాదాపు 29 సంవత్సరాల వరకు అనుమతిస్తున్నాయి. 
పరాయి ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్న టాప్ 10 దేశాలు, వారి సంఖ్య ఇలా ఉంది:
1. బ్రెజిల్ - 1,236
2. ఫ్రాన్స్ - 821
3. అర్జెంటీనా - 760
4. సెర్బియా - 465
5 ఇంగ్లండ్ - 413
6 స్పెయిన్ - 361
7 క్రొయెషియా - 346
8. జర్మనీ - 346
9. కొలంబియా - 327
10. ఉరుగ్వే - 324
పేరుకు పేరు, టీమ్‌లో మంచి ప్లేసు, బెస్ట్ ప్యాకేజ్ దక్కుతున్నప్పుడు దేశమేదైనా, లీగ్ ఏదైనా, టీమ ఏదైనా నో ప్లాబ్లమ్ అంటూ టాలెంటెడ్ ప్లేయర్స్ ఎక్కడికైనా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారని ఫైనల్‌గా సదరు గ్లోబల్ స్టడీ తేల్చి చెప్పింది.

loader