ఉమెన్స్ జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతగా టీమిండియా... ఫైనల్‌లో సౌత్ కొరియాపై సంచలన విజయం..

ఉమెన్స్ జూనియర్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో సౌత్ కొరియాపై 2-1 తేడాతో విజయం అందుకున్న భారత మహిళా హాకీ జట్టు..  అభినందించిన భారత ప్రధాని.. 

Team India Womens team clinches Hockey Womens junior Asia Cup by beating south Korea in final CRA

జూన్ 2న పాకిస్తాన్‌ని ఓడించి, మెన్స్ టీమ్ జూనియర్ హాకీ ఆసియా కప్ సాధిస్తే, 10 రోజుల తర్వాత అమ్మాయిల టీమ్ ఈ ఫీట్‌ని రిపీట్ చేసింది. జపాన్‌లోని కకమీగహరా ఏరియాలో ఉన్న కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ హాకీ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ జూనియర్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో సౌత్ కొరియాపై 2-1 తేడాతో విజయం సాధించింది భారత మహిళా జట్టు..

ఆట మొదలైన తర్వాత 22వ నిమిషంలో టీమిండియా తరుపున అన్ను మొదటి గోల్ సాధించి, టీమ్‌కి 1-0 ఆధిక్యం అందించింది. ఆ తరవ్ాత ఆట 25వ నిమిషంలో సౌత్ కొరియా ప్లేయర్ సియోన్ పార్క్ గోల్ చేయడంతో స్కోర్లు 1-1 తేడాతో సమం అయ్యాయి..

అయితే ఆట 41వ నిమిషంలో గోల్ చేసిన టీమిండియా ప్లేయర్ నీలమ్, భారత్‌కి 2-1 ఆధిక్యం అందించింది. చివరి వరకూ  ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత మహిళా హాకీ జట్టు, 2023 ఉమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచింది..

భారత మహిళా హాకీ జట్టుకి ఇదే మొట్టమొదటి జూనియర్ ఆసియా కప్ కాగా, ఫైనల్‌లో భారత్ చేతుల్లో ఓడిన సౌత్ కొరియా ఇప్పటికే నాలుగు సార్లు ఛాంపియన్‌షిప్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది..

హాకీ జూనియర్ ఆసియా కప్ 2023 టోర్నీలో పురుషుల, మహిళల టైటిల్స్ రెండూ కూడా టీమిండియాకే దక్కడం విశేషం. జూనియర్ ఆసియా కప్ గెలిచిన భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందించారు...

‘2023 ఉమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్ గెలిచిన మన యంగ్ ఛాంపియన్స్‌కి కంగ్రాట్స్. అపారమైన పట్టుదలకు ప్రతిభను జోడించి సమిష్టి కృషితో టైటిల్ గెలిచారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. వారి భవిష్యత్‌కి బెస్ట్ ఆఫ్ లక్...’ అంటూ ట్వీట్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios