పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీంఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఇప్పటి వరకు జరిగిన ద్వైపాక్షిక సీరిస్ లలో వికెట్లు పడగొట్టడంలో అధికంగా బాగస్వామ్యం వహించిన వికెట్ కీపర్లలో ఎంఎస్. ధోని, వృద్ధిమాన్‌ సాహా, సయ్యద్ కిర్మాణీ  ముందున్నారు. వీరు ఆసిస్ తో భారత్ తలపడ్డ ఓ టెస్ట్ సీరిస్ లో మొత్తం 14 మంది ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగస్వామ్యం వహించారు. అయితే పంత్ పెర్త్ టెస్ట్ లో వీరందరి రికార్డులను ఒకేసారి బద్దలుగొట్టాడు. 

సెకండ్ ఇన్సింగ్సులో ఆసిస్ ఆటగాడు షాన్ మార్ష్ ను క్యాచ్ ను అందుకోవడం ద్వారా రిషబ్ వీరందరిని అదిగమించాడు. ఈ క్యాచ్ ద్వారా ఆసిస్ బ్యాట్ మెన్ ఔట్లలో పంత్ భాగస్వామ్యం 15 కు చేరింది. మొత్తంగా మొదటి రెండు టెస్టులలో కలిపి పంత్ ఔట్ల భాగస్వామ్యం 17కు చేరింది.   

బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొత్తం రెండు ఇన్నింగ్సుల్లో కలిపి రిషబ్ పంత్ 11 మంది ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగస్వామ్యం వహించాడు.  తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టుకున్న పంత్... రెండో ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు పట్టడం ద్వారా ఇక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న భారత వికెట్ కీపర్‌గా ధోనీతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 11 క్యాచ్ లు పట్టడం ద్వారా వృద్ధిమాన్ సాహా(10 క్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును రిషబ్ బ్రేక్ చేశాడు.  

ఇప్పటివరకు ఈ సీరిస్ లో పంత్ 17 మంది ఆటగాళ్లను ఔట్ చేయడంతో భాగస్వామ్యం వహించాడు. ఇంకా ఈ సీరిస్ లో భాగంగా మరో రెండు టెస్టులు జరగనున్నాయి. వీటిలో కూడా రిషబ్ పంతే వికెట్ కీఫర్ గా వ్యవహరించనున్నాడు కాబట్టి మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు

ఒక్క టెస్టులో 11 క్యాచ్‌లు.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

పెర్త్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట... విజయావకాశాలు సగం సగం