భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సెకండ్ ఇన్సింగ్స్ లో భారత్ బ్యాట్ మెన్స్ తడబాటు కొనసాగుతోంది. నాలుగో వికెట్ రూపంలో కోహ్లీ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన విహారీతో కలిసి రహానే కాస్త నిలకడగా ఆడుతూ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీంఇండియా మెళ్లమెళ్లగా ఓటమి అంచుల నుండి బయపటపడి గెలుపు వైపు పయనిస్తోందని అందరూ భావించారు. అయితే మరికాసేపట్లో నాలుగో రోజు ఆట ముగుస్తుందనగా రహానే( 30 పరుగులు) వికెట్ పడింది. దీంతో మరోసారి టీంఇండియా శిబిరంలో ఆందోళన మొదలయ్యింది. 

ఆటముగిసే సమయానికి భారత్ 112 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. విహారి( 24 పరుగులు)తో పాటు పంత్(9 పరుగులు) క్రీజులో వున్నారు. అయితే భారత జట్టు గెలుపుకు మరో 175 పరుగుల దూరంలో  ఉంది. క్రీజులో వున్న ఇద్దరు ఆటగాళ్లను మినహాయిస్తే మిగలినవారంతా బౌలర్లే. దీంతో ఏదైనా జోడి అద్బుత భాగస్వామ్యాన్ని నెలకొల్పితే తప్ప భారత్ విజయం కష్టమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మిగిలిన ఐదు వికెట్లు పడగొడితే రెండో టెస్టులో ఆసిస్ విజయం సాధించి సిరిస్ ను సమం చేయనుంది. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.

ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటింగ్ నత్తనడకన సాగింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ ... స్టార్క్ బౌలింగ్‌లో పరుగులేమి చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాను హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించిన అనంతరం ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను లైన్ విడదీశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓపెనర్ మురళీని కూడా లైన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం భారత్ 22.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చసింది. రహానే 13, హనుమ విహారి 0 పరుగులతో క్రీజులో ఉన్నారు