న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే ఓడించి టీంఇండియా చరిత్ర సృష్టించింది. ఐదు వన్డేల సీరిస్ ను వరుసగా మూడు వన్డేల్లో గెలిచి ఖాయం చేసుకోగా...ఆదివారం జరిగిన
చివరి వన్డేలో కూడా భారత్ విజయం సాధించింది. ఇలా 4-1 తేడాతో భారత్ విదేశీ గడ్డపై వరుసగా మరో ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచ కప్ కు ముందు వరుస విక్టరీలతో దూసుకుపోతున్న భారత జట్టు న్యూజిలాండ్ పై గెలుపును వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది.

ఇటీవల బాలీవుడ్‌లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో యూరి పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమాలో భారత ఆర్మీ జవాన్ గా నటించిన హీరో తోటి సైనికుల్లో మనో స్థైర్యాన్ని, జోష్ ను పెంచడానికి ఓ డైలాగ్ వాడతాడు. ఇలా అతడు వాడిన 'హౌ ఇజ్‌ ది జోష్( జోష్ ఎలా వుంది)' అనే డైలాగ్‌ చాలా ఫేమస్ అయింది. ఈ డైలాగ్ టీంఇండియా ఆటగాళ్ళలో కూడా మంచి జోష్ ను నింపినట్లుంది. న్యూజిలాండ్ వన్డే సీరిస్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్లందరూ ఈ డైలాగ్ తో సంబరాలు చేసుకున్నారు. 

యువ క్రికెటర్ కేదార్ జాదవ్ ‘హౌ ఇజ్‌ ది జోష్’అంటే మిగతా జట్టు సభ్యులు 'హై సర్' అన్నారు. ఇలా ట్రోపి అందుకున్న జట్టు సభ్యులంతా ఈ డైలాగ్ రిపీట్ చేస్తున్న వీడియోను బిసిసిఐ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను బిసిసిఐ యూరి  సినిమా  హీరో విక్కి కౌశల్ కు ట్యాగ్ చేసింది. దీంతో అతడు కూడా తనదైన శైలిలో ఈ  వీడియోపై రీట్వీట్ చేశాడు. 

''దేశ ప్రజల అభిమానంలో భారత జట్టు ఎప్పుడూ ఇలాగే జోష్ తో వుండాలి. ఇలాంటి మరెన్నో విజయలు సాధించి మనం గర్వించేలా చేయాలి. ఈ ఘనవిజయం సాధించిన టీంఇండియా శుభాకాంక్షలు'' అంటూ విక్కీ కౌశల్ ట్వీట్ చేశారు.  

వీడియో