మనపై పాక్ పైచేయి సాధిస్తుంది.. ఆసియాకప్ ఆడకండి: సెహ్వాగ్

team india ex Opener virender sehwag slams asia cup shedule
Highlights

తీరికలేని షెడ్యూల్‌ని సెట్ చేయడంపై బీసీసీఐ మండిపడింది. వెంటనే పాక్‌తో జరిగే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని ఐసీసీని కోరింది. ఈ వాదనకు భారత మాజీ క్రికెటర్లు సైతం మద్ధతు పలుకుతున్నారు.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

ఆసియాకప్-2018 షెడ్యూల్‌పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అన్ని జట్లకు కనీస విశ్రాంతినిచ్చి భారత్‌కు మాత్రం రెస్ట్ లేకుండా తీరికలేని షెడ్యూల్‌ని సెట్ చేయడంపై బీసీసీఐ మండిపడింది. వెంటనే పాక్‌తో జరిగే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని ఐసీసీని కోరింది. ఈ వాదనకు భారత మాజీ క్రికెటర్లు సైతం మద్ధతు పలుకుతున్నారు.. తాజాగా ఈ విషయంపై స్పందించాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..

షెడ్యూల్ చూసి నేను షాకయ్యా... ఈ రోజుల్లో ఏ జట్టు కూడా వరుసగా రెండు వన్డేలు ఆడటం లేదని.. ఇంగ్లాండ్ టూర్‌లో టీ20ల మధ్యే రెండు రోజుల గ్యాప్ ఉందని... ఎంతో వేడిగా ఉండే దుబాయ్ వాతావరణంలో ఆటగాళ్లు వరుసగా రెండు వన్డేలు ఆడలేరని...ఇది కచ్చితంగా సరైన షెడ్యూల్ కాదని వీరూ అన్నాడు.. ఇలాంటి షెడ్యూల్ వల్ల ఇండియాపై పాక్ పై చేయి సాధించే అవకాశం ఉందని.. ఆసియాకప్ కోసం బాధపడాల్సిన అవసరం లేదని.. ఆ టోర్నీ ఆడాల్సిన అవసరం లేదని సెహ్వాగ్ సూచించాడు..

దానికి బదులుగా భారత జట్టును మరో సిరీస్‌కు సిద్ధం చేయాలని స్పష్టం చచేశారు. ఆసియాకప్‌లో భాగంగా సెప్టెంబర్ 18న టీమిండియా క్వాలిఫయిర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడుతుంది.. ఆ తర్వాతి రోజు పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సి వుంది.. పాకిస్తాన్‌కు మాత్రం సెప్టెంబర్ 16న తొలి మ్యాచ్ క్వాలిఫయిర్ జట్టుతో ఆడతుంది.. అనంతరం రెండు రోజుల గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 19న టీమిండియాతో పాక్ తలపడుతుంది.

loader