భారత దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవ లేదని భారత సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ స్ఫష్టం చేశాడు. ప్రస్తుతమున్న క్రికెట్ జట్టు అత్యుత్తమప్రతిభ కలిగిన ఆటగాళ్లను కలిగి వుందన్నారు. దేశవాళీ క్రికెట్ టోర్నీల వల్ల యువ ఆటగాళ్లు రాటుదేలుతున్నారని...అందువల్లే అంతర్జాతీయ జట్టు అంత పటిష్టంగా మారిందని  ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

దేశ వాళీ క్రికెట్ మ్యాచులను చూడటాన్ని తానెంతో ఇష్టపడతానని ప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ మ్యాచుల కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అందువల్ల దేశవాళి క్రికెటర్లలో ఎవరూ బాగా ఆడుతున్నారో తెలుస్తుందని...వారికి అంతర్జాతీయ జట్టుల్లో అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఎంఎస్కే వెల్లడించారు. 

భారత క్రికెట్ భవిష్యత్ మొత్తం దేశవాళి క్రికెట్లోనే వుందన్నారు. ఈ మ్యాచుల ద్వారానే యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థానం కోసం ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు ఎదురు చూస్తున్నారని...ఈ పోటీ క్రికెట్ కు మంచిదేన పేర్కొన్నారు. మరో పదేళ్ల పాటు  భారత జట్టులో నాణ్యమైన క్రికెటర్లకు లోటు లేదని ఎంఎస్కే అభిప్రాయపడ్డారు. 

భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ యువ క్రికెటర్లకు ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాడని ప్రశంసించారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించి ఆకట్టుకున్న క్రికెటర్లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే శిక్షణ పొందినట్లు తెలిపారు. అటను తన అనుభవంతో యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే తీరు ఎంతో భావుంటుందని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు.