భారత జట్టు తరపున ఆడుతూ...తన పదునైన పాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థుల ఆటకట్టించిన బౌలర్ మనాఫ్ పాటిల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని  రకాల పార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు మునాఫ్ ఇవాళ ప్రకటించాడు. 

రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా మునాఫ్ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఇప్పటికే రిటైర్ అయ్యారని తెలిపాడు. అయితే అందులో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడుతూ రిటైర్మెంట్ ప్రకటించారని....కానీ తనకు మాత్రం ఆ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి ఆటగాడు ఏదో సమయంలో రిటైర్ కావాల్సిందేనని తనకు ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లు అనిపించి వెంటనే ప్రకటిస్తున్నట్లు మునాఫ్ తెలిపాడు. 

 మొహాలీ వేదికగా 2006  లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో మునాఫ్ టీం ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఆరంగేట్ర మ్యాచ్ లోనే చెలరేగి నాలుగు వికెట్లు పడగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అనుకున్నంతగా రాణించలేక పోయాడు. దీంతో కేవలం 13 టెస్ట్ మ్యాచులే ఆడిన మునాఫ్ 35 వికెట్లు పడగొట్టాడు. అదే ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్‌లో వన్డేల్లోనూ ఆరంగేట్రం చేశాడు. మొత్తం 70 మ్యాచ్‌లాడి 86వికెట్లు తర ఖాతాలో వేసుకున్నాడు.

 2011 ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భారత జట్టుకు దూరమైన మునాఫ్ కు మళ్లీ అవకాశం రాలేదు. ఇలా మునాఫ్ ఆరంగేట్రంతో పాటు చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుతోనే ఆడటం విశేషం. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మునాఫ్ ధన్యవాదాలు తెలిపాడు.