బుమ్రా సర్జరీ ఫెయిల్.. ఇంగ్లాండ్‌తో టెస్టుకు అనుమానమే.. బ్యాండేజ్‌లతో ఆడొచ్చట

team india bowler bumrah surgery fails
Highlights

టీమిండియా యంగ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతని బొటన వేలికి జరిగిన సర్జరీ ఫెయిల్ అయినట్లు సమాచారం.

టీమిండియా యంగ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతని బొటన వేలికి జరిగిన సర్జరీ ఫెయిల్ అయినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఐర్లాండ్‌తో టీ-20లు ఆడింది. దీనిలో భాగంగా తొలి టీ-20లో బుమ్రా బొటన వేలికి గాయమవ్వడంతో అతను ఇంగ్లాండ్‌తో టీ-20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా గాయానికి సర్జరీ చేయాలని వైద్యులు భావించారు.

దీనిలో భాగంగానే జరిగిన సర్జరీ ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది.. ‘‘ బుమ్రా గాయం నుంచి కోలుకోవడానికి మరో మూడు, నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని.. అతను బౌలింగ్ చేయని చేతికి గాయమైంది కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాండేజ్‌లు కట్టుకుని ఆడొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

టీ-20, వన్డే సిరీస్‌లకు బుమ్రా దూరమైనప్పటికీ మూడు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ పేరు ఉంది. అతను రెండో టెస్ట్ నాటికి జట్టును చేరుకుంటాడని బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే గాయం ఇంకా తగ్గకపోవడంతో అతను టెస్టులకు ఆడేది అనుమానంగా మారింది.

loader