రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 16.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చేసి అలవోగా టార్గెట్ ఫినిష్ చేసింది.

ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, పృథ్వీషాలు వన్డే తరహా ఆట తీరుతో విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రాహుల్ 33 , షా 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కేవలం మూడు రోజుల్లో రెండో టెస్ట్ ముగియడం విశేషం.. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 308/4 తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌‌ స్వల్ప వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. 84వ ఓవర్‌లో రహానే పెవిలియన్ చేరగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు.

రెండో రోజు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపెట్టిన రిషబ్ పంత్ కూడా అవుట్ అయ్యాడు.. ఈ క్రమంలో అతడు తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.అనంతరం టెయిటెండర్లు విఫలమవ్వడంతో భారత్ 106.4 ఓవర్లలో 367 పరుగులకు అలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 56 పరుగుల ఆధిక్యం లభించింంది..

భారత బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ 92, రహానే 80, పృథ్వీ షా 70 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలి.. టీమిండియా ముందు 72 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.