న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సీరిస్ లో భారత జట్టు మేనే‌జ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం తనను ఆశ్యర్యానికి గురిచేసిందని యువ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ పేర్కొన్నాడు. అయితే ఆ నిర్ణయం  మాత్రం తనకెంతో ఉపయోగపడిందని తెలిపాడు. దీని కారణంగా రెండో టీ20లో కాస్త తడబడ్డా మొదటి, మూడో టీ20లో మాత్రం మెరుగ్గా రాణించగలిగానని విజయ్ శంకర్ వెల్లడించాడు. 

ఇంతకూ ఈ  యువ క్రికెటర్‌ను ఆశ్యర్యానికి గురిచేసిన నిర్ణయం ఏమిటంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్ లభించడమే. మొదటి టీ20లో విజయ్ మూడో  స్థానంలో బరిలోకి దిగి 18 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. దీంతో టీంఇండియా మేనేజ్ మెంట్ కు అతడిపై నమ్మకం కుదిరి రెండు, మూడు టీ20ల్లో కూడా అదే స్థానంలో ఆడించారు.  ఇలా మూడో టీ20లో ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగిన విజయ్ శంకర్ 28 బంతుల్లో 43 పరుగులు సాధిచాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తాను ఏ స్థానంలో అయినా ఆడగలనన్న ఆత్మవిశ్వాసం వచ్చిందని విజయ్ శంకర్ తెలిపారు. 

తన బ్యాటింగ్ ప్రమోషన్ గురించి విజయ్ మాట్లాడుతూ... మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని టీమిండియా మేనేజ్‌మెంట్‌ అడగడంతో చాలా ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు. అయితే ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేదని...దాన్ని ఓ అవకాశంగా భావించానని  పేర్కొన్నాడు. జట్టు అవసరాల కోసం ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ కు దిగి తన సత్తా చాటగలనని విజయ్ తెలిపాడు. 

బ్యాటింగ్ లో ధోని, రోహిత్ వంటి సీనియర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా ఆనందంగా వుందన్నాడు. వాళ్లతో కలిసి ఆడటం వల్ల మరెన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. చివరి మ్యాచ్ లో తాను ఆడిన ఎంతో ఖచ్చితమైన భారీ షాట్లను ఆడానని...అయితే వికెట్ మధ్య పరుగెత్తుతూ సింగిల్స, డబుల్స్ కూడా సాధించాల్సిందని అన్నాడు.  

ఈ టీ20 సీరిస్ లో తనకు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదని విజయ్ తెలిపాడు. కానీ వేరు వేరు వాతావరణాల్లో బౌలింగ్ ఎలా చేయాలో వచ్చిన కొన్ని అవకాశాలతోనే నేర్చుకున్నానని పేర్కొన్నాడు. ఆలా న్యూజిలాండ్ పర్యటనలో క్రికెట్ సంబంధించిన చాలా పాఠాలు నేర్చచుకున్నానని విజయ్ శంకర్ వెల్లడించాడు.