సానియా మీర్జా ఖాతాలో మరో రన్నరప్ టైటిల్... చార్లెస్‌స్టన్ ఓపెన్ టోర్నీలో పోరాడి ఓడిన...

చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022లో డబుల్స్‌ రన్నరప్‌గా నిలిచిన సానియా మీర్జా... చెక్ రిప్లబిక్ టెన్నిస్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి బరిలో దిగిన భారత టెన్నిస్ స్టార్... 

TATA IPL2022: Sania Mirza losses in Charleston Open 2022 final

భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, తన కెరీర్ చివర్లో చిరస్మరణీయ విజయాలను అందుకుంటోంది. చార్లెస్‌స్టన్ ఓపెన్ 2022లో చెక్ రిప్లబిక్ టెన్నిస్ ప్లేయర్ లూసీ హ్రాడెస్కాతో కలిసి బరిలో దిగింది భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా...

ఫైనల్ మ్యాచ్‌లో ఫోర్త్ సీడ్ జోడీ అండ్రేకెజా క్లెపా, మగ్డా లినెట్టేలను 6-2, 4-6, 10 -7 తేడాతో పోరాడి ఓడింది సానియా మీర్జా, లూసీ హ్రాడెస్కా జోడీ... 2 గంటల 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా పోరాడి ఓడిన సానియా, లూసీ జోడీ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది...

తొలి సెట్‌లో పోరాడకుండానే చేతులు ఎత్తేసిన సానియా జోడీ, రెండో సెట్‌లో అద్భుతంగా పోరాడి సెట్‌ని కైవసం చేసుకుంది. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే మూడో సెట్‌లో హోరాహోరాగా పోరాడినా... ఆరంభంలో దక్కిన ఆధిక్యాన్ని అద్భుతంగా కాపాడుకున్న ఆండ్రేకెజా క్లెపా, మగ్డా లినెట్టే జోడీ... మ్యాచ్‌నీ, టైటిల్‌నీ కైవసం చేసుకుంది...

అంతకుముందు టాప్ సీడ్ జాంగ్ షువాయ్, కరోలినా డోలేహైడ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2- 6, 6 - 4, 8 - 10 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌లో అడుగుపెట్టింది సానియా, లూసీ జోడీ... ‘కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు, కొన్ని రజత పతకాలు, మరికొన్ని మణికట్టు మయాజాలాలు, ఇంకొన్ని పోరాటాలు... కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు... ఈ 5 వారాలు సాలీడ్‌గా సాగాయి. మధుర అనుభూతులను మిగిల్చిన అమెరికాకు ధన్యవాదాలు... మరికొన్ని నెలల్లో మళ్లీ వస్తా... ’ అంటూ కాప్షన్ జోడించింది సానియా మీర్జా... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

మే 2022లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో లూసీ హ్రాడెస్కాతో కలిసి బరిలో దిగనుంది భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా... జనవరిలో 2022 సీజన్‌తో టెన్నిస్ కెరీర్‌కి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించింది సానియా మీర్జా. ఓ బిడ్డకు తల్లైన తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ 2021 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చిన సానియా మీర్జా, రెండో రౌండ్ నుంచి నిష్కమించింది. 

అమెరికాలో ఈ ఐదు వారాలు అద్భుతంగా సాగిందని, సాధించిన విజయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది సానియా మీర్జా. 2022 డిసెంబర్‌తో సానియా మీర్జా సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ ముగియనుంది. 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చిన సానియా మీర్జా, 19 ఏళ్లుగా భారత టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని విజయాలను అందుకుంది...

వుమెన్స్ డబుల్స్‌లో నెం.1 ర్యాంకు సాధించిన మొట్టమొదటి భారత టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సానియా మీర్జా... భారత్‌లో ఎందరో యువతులు రాకెట్ పట్టి, టెన్నీస్ ఆటపై ఆసక్తి చూపించేందుకు స్పూర్తిదాయకంగా నిలిచింది. పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్లాడని మీర్జా, 2018లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకి ఇజహాన్ మీర్జా మాలిక్‌ అని పేరు పెట్టిన సానియా, కొడుకుతో కలిసి ఒలింపిక్స్‌లో పాల్గొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios