వరల్డ్ రికార్డు జంప్... టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ రికార్డు బ్రేక్ చేసిన జెస్విన్ ఆల్డ్రిన్...
లాంగ్ జంప్‌లో 8.42 మీటర్లు దూకి, సరికొత్త నేషనల్ రికార్డు క్రియేట్ చేసిన జెస్విన్ ఆల్డ్రీన్.. బల్లారిలో జరుగుతున్న 2వ ఇండియన్ ఓపెన్ జంప్స్ 2023 పోటీల్లో రికార్డు పర్ఫామెన్స్..
టోక్యో ఒలింపిక్స్ 2020లో టీమిండియా ఆశించిన స్థాయిలో పతకాలు రాబట్టలేకపోయింది. ముఖ్యంగా లాంగ్ జంప్ ఈవెంట్‌లో మనవాళ్లు పతకాలు తేలేకపోయారు. అయితే టోక్యో ఒలింపిక్స్ 2020లో గోల్డ్ మెడల్ సాధించిన గ్రీక్ లాంగ్ జంపర్ రికార్డునే అధిగమించాడో 21 ఏళ్ల తమిళనాడు కుర్రాడు...
టోక్యో ఒలింపిక్స్ 2020 టోర్నీ లాంగ్ జంప్ పోటీల్లో గ్రీకు లాంగ్ జంపర్ మిల్టీయాదిస్ టంటోగ్లో 8.41 మీటర్లు దూకి స్వర్ణ పతకం సాధించాడు. ఈ రికార్డును +0.1 తేడాతో అధిగమించాడు తమిళనాడు లాంగ్ జంపర్ జెస్విన్ ఆల్డ్రీన్..
కర్ణాటకలోని బల్లారిలో జరుగుతున్న 2వ ఇండియన్ ఓపెన్ జంప్స్ 2023 పోటీల్లో లాంగ్ జంప్‌లో 8.42 మీటర్లు దూకి, సరికొత్త నేషనల్ రికార్డు నమోదు చేశాడు జెస్విన్ ఆల్డ్రీన్.. ఇది ఆసియా చరిత్రలో ఐదో రికార్డు కాగా వరల్డ్ లాడర్‌లోనూ చోటు దక్కించుకుంది..
తొలి ప్రయత్నంలో 8.05 మీటర్లు, రెండో ప్రయత్నంలో 8.26 మీటర్లు దూకిన జెస్విన్ ఆల్డ్రీన్, మూడో ప్రయత్నంలో 8.42 మీటర్లు అందుకుని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.
2019 తర్వాత 8.40 మీటర్లు అందుకున్న మొట్టమొదటి ఆసియా అథ్లెట్‌గా నిలిచిన జెస్విన్ ఆల్డ్రీన్, గత మూడేళ్లలో 8.40+ మీటర్ల దూరాన్ని అధిగమించిన ఐదో అథ్లెట్‌గా నిలిచాడు..
7.85 మీటర్లు దూకిన మహ్మద్ యెహియా రజతం సాధించగా 7.77 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచిన రిషబ్ రిషీశ్వర్ కాంస్య పతకం గెలిచాడు.
‘గత ఏడాదే నేషనల్ రికార్డు బ్రేక్ చేయాలని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అందుకే ఈ సారి ఆ రికార్డు బ్రేక్ చేయాలని కసిగా ప్రయత్నించాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేషనల్ రికార్డు నా పేరిట ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు జెస్విన్ ఆల్డ్రీన్...
ఇంతకుముందు 2022 ఫెడరేషన్ కప్ ఈవెంట్‌లో 8.36 మీటర్లు దూకిన మురళీ శ్రీశంకర్, లాంగ్ జంప్ ఈవెంట్స్‌లో నేషనల్ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును +0.5 మీటర్ల తేడాతో బ్రేక్ చేశాడు జెస్విన్ ఆల్డ్రీన్..
కజకిస్థాన్‌లో జరిగిన 2023 ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 7.97 మీటర్లు దూకి రజతం గెలిచిన జెస్విన్ ఆల్డ్రీన్, ఆ తర్వాత వరుసగా విఫలమవుతుండడంతో కామన్వెల్త్ గేమ్స్ 2022 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...