మారువేషంలో ముంబై వీధుల్లోకి వెళ్లి చిన్నారులతో గల్లీ క్రికెట్‌ ఆడి సందడి చేశాడు. పొడవాటి నెరిసిన జట్టుతో వృద్ధుడిలా మారువేషం వేసుకున్న లీ వీధుల్లో క్రికెట్‌ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లి తాను కూడా చేరనని అడిగి మరీ ఆడాడు. తొలుత ఆట గురించి తనకేమీ తెలియదన్నట్టు నటించిన లీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తన టాలెంట్‌ చూపించి చిన్నారులను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు. చివరగా తాను ఎవరో చెప్పడంతో చిన్నారులు ఆనందంతో గంతులేశారు. వారికి ఆటోగ్రా్‌ఫలు ఇచ్చి సంతోషపెట్టాడు.