సునీల్ చెత్రికి వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే..!

Sunil Chhetri predicts Germany reach finals
Highlights

సునీల్ చెత్రికి వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే..!

హైదరాబాద్: ఇండియన్ ఫుట్‌బాల్ స్కిప్పర్ సునీల్ చెత్రి వరల్డ్ కప్ ఫలితంపై భవిష్యవాణి వినిపించాడు. కప్ సాధించే చాన్సెస్ జర్మనీకే ఎక్కువ ఉన్నాయని తేల్చి చెప్పాడు. 
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా రష్యాలో జరగనున్న వరల్డ్ కప్‌లో టీమ్స్ గురించి తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు.
 
అర్జెంటీనా, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్ లాంటి దిగ్గజ దేశాలు వరల్డ్ కప్ కోసం పోటీపడుతున్న తరుణంలో ఫైనల్స్‌కు ఎవరు చేరుకుంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ ''నేనైతే జర్మనీ అంటాను. టీమ్ చాలా పటిష్టంగా ఉంది. అలాగని బ్రెజిల్, స్పెయిన్ టీమ్స్ అల్లాటప్పాగా ఏమీ లేవు. బెల్జియం, ఫ్రాన్స్‌కు టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక పోర్చుగల్, అర్జెంటీనా టీమ్స్ విషయానికి వస్తే ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్స్ వాటి సొంతం. అంతగా ఒత్తిడికి గురికాని ఇంగ్లండ్‌తో అప్రమత్తంగా ఉండాలి. అది చాప కింద నీరులా పైకి కనిపించకుండా ఎంత పనైనా చేయవచ్చు. మొత్తంగా చూసినప్పుడు జర్మనీ, బ్రెజిల్ పటిష్టమైన టీమ్స్ అని నాకు అనిపిస్తోంది'' అని చెత్రి విశ్లేషించాడు.

పోయినసారి వరల్డ్ కప్‌లో బ్రేకౌట్ స్టార్‌గా జేమ్స్ రోడ్రిగ్జ్ అవతరించాడు. మరి ఈసారి ఆ అవకాశం ఎవరికి దక్కవచ్చన్న దానిపై మాట్లాడుతూ "బ్రేకౌట్ స్టార్.. వినడానికి బాగుంటుంది కానీ ఫేమస్ చెప్పుకోదగ్గంత ఫేమస్ బిరుదు కాదది. అలా చూసినప్పుడు బప్పే ఇప్పటికే ఓ స్టార్‌గా వెలిగిపోతున్నాడు. అదే సమయంలో అతడిలో గొప్ప టాలెంట్ ఉంది. లాస్ట్ ఫోర్‌కు చేరుకునే అవకాశం ఫ్రాన్స్‌కు ఉంది. జర్మనీ ఫైనల్‌కు చేరుకోవచ్చు కాబట్టి ముల్లెర్‌కు ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. గ్రిజ్‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రాన్సు‌కు చెందిన మరో గొప్ప టాలెంట్ ఉన్న ప్లేయర్ కంటే. ఆ లెక్కన చూసినప్పుడు చాలా మంది యువ ప్లేయర్స్ ఉన్నారు. కనుక ఈ విశ్లేషణలన్నీ మానేసి వరల్డ్ కప్‌ను చూస్తూ ఎంజాయ్ చెయ్యమని అందరికీ చెబుుతున్నా" అని చెత్రి ముగించాడు.

loader