Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ కు తొలి మెడ‌ల్ అందించిన మ‌ను భాక‌ర్

Who is Manu Bhaker:  భార‌త స్టార్ షూట‌ర్ మ‌ను భాక‌ర్ చ‌రిత్ర సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్ లో భార‌త్ కు తొలి మెడ‌ల్ అందించారు. 
 

Star shooter Manu Bhaker  won India's first medal in Paris Olympics 2024 RMA

Who is Manu Bhaker: భార‌త షూట‌ర్ మ‌ను భాక‌ర్ పారిస్ ఒలింపిక్స్ 2024 లో చరిత్ర సృష్టించారు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి మెడల్ ను అందించారు. శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైన‌ల్ చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. 580 స్కోర్ తో మను భాక‌ర్ మూడో స్థానంలో ఉండ‌గా, త‌న‌కంటే ముందు దక్షిణ కొరియాకు చెందిన‌ ఓహ్ యే జిన్ 582 స్కోర్ తో రెండు స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో ఉన్న హంగేరీకి చెందిన మేజర్ వెరోనికా కూడా 582 స్కోర్ ను సాధించారు. ఫైనల్ పోరులో మొదటి 1 షాట్స్ లో 100.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇద్దరు కొరియన్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్ లో మిగతా ఐదుగురు ప్లేయర్లు ఔట్ అయ్యారు. 221.7 పాయింట్లతో మను భాకర్ కాంస్య పతకం గెలిచారు. 243.2 పాయంట్లతో కొరియన్ ప్లేయర్ ఓహ్ యే జిన్ గోల్డ్ మెడల్ కొట్టారు. మరో కొరియన్ షూటర్ కిమ్ సిల్వర్ మెడల్ సాధించారు.  

 

 

 

Star shooter Manu Bhaker  won India's first medal in Paris Olympics 2024 RMA

 

ఎవ‌రీ మ‌ను భాక‌ర్? 

భార‌త స్టార్ షూట‌ర్ల‌లో మ‌ను భాక‌ర్ ఒక‌రు. యుక్తవయసులోనే అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌క్కువ కాలంలోనే షూటింగ్ స్టార్‌గా త‌న‌ ర్యాంక్‌లను పెంచుకున్నారు. బాక్సర్లు, రెజ్లర్‌లకు పేరుగాంచిన హర్యానాలోని ఝజ్జర్‌లో జన్మించిన మను భాకర్ పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను ఎంచుకున్నారు. ఆమె 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది.

2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసిన తర్వాత త‌న‌ 14 సంవత్సరాల వయస్సులో షూటింగ్‌లోకి మారింది. ఒక వారంలోపు మను భాకర్ తన నైపుణ్యాన్ని పెంచుకోవ‌డానికి స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని తీసుకురావాలని ఆమె తండ్రిని కోరింది. ఆమెకు ఎప్పుడూ మద్దతునిచ్చే తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆమెకు స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్‌ని కొనిచ్చాడు. ఏదో ఒక రోజు మ‌ను భాక‌ర్ ను ఈ పిస్ట‌ల్ ఒలింపిక్ ఛాంపియ‌న్ గా మారుస్తుంద‌ని ఆకాంక్షించారు. 

త‌న తండ్రి క‌ల‌ల‌ను నిజం చేస్తూ మ‌ను భాక‌ర్ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ షూట‌ర్ గా ఎదిగారు. 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్ ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూకు షాకిచ్చారు. మను భాక‌ర్ 242.3 రికార్డు స్కోరుతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సిద్ధూ సాధించిన మార్కును అధిగమించారు. ఆ తర్వాత 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి ఒలింపిక్ వేదిక‌పై పోటీ ప‌డుతూ బ్రాంజ్ మెడ‌ల్ సాధించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios