సహచర క్రీడాకారిణిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్

South Africa women's cricket team captain Dane van Niekerk marries all-rounder Marizanne Kapp
Highlights

దక్షిణాప్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ పెళ్లి చేసుకుంది. అంటే ఇందులో విశేషం ఏముంది, అందరిలాగే ఆమె కూడా పెళ్లిచేసుకుని ఉంటుంది కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఆమె పెళ్లి చేసుకుంది ఓ మహిళా క్రీడాకారిణినే. ఈమె తన సహచర క్రికెటర్ ని పెళ్ళి చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

దక్షిణాప్రికా కెప్టెన్ డేన్‌ వాన్‌ నికెర్క్ అదే టీంలోని టాప్ ఆల్ రౌండర్ మరిజాన్ కాప్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దేశంలో మహిళలు సహజీవనం చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. దీంతో ఎప్పటినుండో కలిసి తిరుగుతున్న వీరిద్దరు తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 

2009 లో జరిగిన వరల్డ్ కప్ ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. ప్రస్తుతం నికెర్స్ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, కాప్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ఐసీసీ ర్యాకింగ్స్ లో టాప్ 10 లో కొనసాగుతున్నారు.

పెళ్లితో ఒక్కటైన ఈ ఇద్దరు క్రీడాకారిణిలు మంచి ఫామ్ లో ఉన్నారు. దక్షిణాప్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కెప్టెన్ నికెర్క్ రికార్డు సృష్టించగా, కాప్ ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

ఇలా ఇప్పటికే న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అమీ సాటర్‌వైట్‌ తన తోటి క్రికెటర్ లియా తహుహు ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి తర్వాత ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. 
 
loader