Asianet News TeluguAsianet News Telugu

ఎన్నో పోటీల్లో గెలుపు.. క్యాన్సర్‌తో పోరాటంలో ఓటమి: దివికేగిన ప్రముఖ షూటర్ పూర్ణిమ

భారత క్రీడా రంగంలో విషాదం చోటు చేసుకుంది. భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే కన్నుమూశారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శనివారం పుణేలో తుదిశ్వాస విడిచారు

shooter pournima zanane who suffered from cancer dies at 42
Author
Pune, First Published Jun 23, 2020, 2:26 PM IST

భారత క్రీడా రంగంలో విషాదం చోటు చేసుకుంది. భారత మాజీ ఎయిర్ రైఫిల్ షూటర్, కోచ్ పూర్ణిమ జనానే కన్నుమూశారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శనివారం పుణేలో తుదిశ్వాస విడిచారు.

భారతదేశం తరపున ఆమె పలు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలు, ఆసియా ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో జాతీయ రికార్డును నెలకొల్పిన పూర్ణియ కోచ్‌గాను రాణించారు.

రైఫిల్ షూటింగ్‌లో ఆమె ప్రతిభకు మెచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం పూర్ణిమను ‘శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ అవార్డు’’ను గెలుచుకుంది. ఆమె మృతి పట్ల భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ), బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, భారత మాజీ రైఫిల్ షూటర్ జాయ్‌దీప్ కర్మాకర్ సంతాపం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios