ఆసీస్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నాయకత్వం, సమర్థవంతమైన సారథ్యం, లీడర్ ఆఫ్ ది టీమ్ తదితర అంశాలపై వార్న్ మాట్లాడాడు.

కోహ్లీ ప్రస్తుతం ఒక జట్టుకు బెస్ట్ లీడర్‌గా మాత్రమే ఉన్నాడని.. ఆటపరంగా కోహ్లీకి పెద్ద అభిమానినన్నాడు. భారత జట్టును కోహ్లీ ముందుండి నడిపిస్తున్నాడని, కానీ సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకుని వెళ్లలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ కేవలం కెప్టెన్ మాత్రమేనని..నాయకుడు కాదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో సరైన సమయంలో సరైన వ్యూహాలు పన్నే వారిలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనలే సమర్థులని షేన్‌వార్న్ తెలిపాడు.