కట్టప్ప బాహుబలిని ఎలా చంపాడో తెలిసింది: కుల్దీప్ పై సెహ్వాగ్ ఫన్నీగా...

Sehwag funny tweet on Kuldeep Yadav
Highlights

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్లకు పెట్టింది పేరు. హాస్యం తొణికిసలాడే ట్వీట్లు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన చైనామన్ కుల్దీప్ యాదవ్ పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్లకు పెట్టింది పేరు. హాస్యం తొణికిసలాడే ట్వీట్లు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన చైనామన్ కుల్దీప్ యాదవ్ పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ ను గడగడలాడించిన విషయం తెలిసిందే. ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ పై సెహ్వాగ్ తనదైన శైలీలో ప్రశంసలు కురిపించాడు.

"అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన కుల్దీప్ బౌలింగ్....కుల్దీప్‌ టాప్‌ 5 గొప్ప ప్రదర్శనలన్నీ ఓవర్సీస్‌లోనివే. కట్టప్ప బహుబలిని ఎలా చంపాడో తెలిసిపోయింది కానీ.. కుల్దీప్‌ ఆట మాత్రం ఇం‍గ్లండ్‌కు అర్థం కావడం లేదు" అని ట్వీట్‌ చేశాడు. 

6 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ ఈ ఘనత సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచులో శతకం చేసిన విషయం తెలిసిందే.

 

loader