ధోనీని ఫాలో అయ్యాడు.. అందరూ సక్సెస్ కాలేరు కదా.. పాక్‌ కెప్టెన్‌పై సెటైర్లు

Sarfraz Ahmed tries to pull off a Dhoni
Highlights

జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్‌స్విప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అనుకరించేందుకు ప్రయత్నించాడు

క్రికెటర్లను మనం ఏ విధంగా అయితే ఫాలో అవుతామో.. క్రికెటర్లు కూడా తోటి క్రికెటర్లను అలాగే అనుకరిస్తూ ఉంటారు. ఫలానా క్రికెటర్‌లాగా షాట్లు కొట్టడమో.. బౌలింగ్ చేయడమో చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఈ పద్ధతి విమర్శల పాలవుతుంటుంది. తాజాగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అలాంటి విమర్శలనే ఎదుర్కొన్నాడు. జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్‌స్విప్ చేసింది.

ఆదివారం జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అనుకరించేందుకు ప్రయత్నించాడు.  స్వతహాగా వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్.. ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో గ్లోవ్స్‌ను వదిలేసి బంతిని అందుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తను బౌలింగ్ చేయడానికి వీలుగా ఫకార్‌జమన్‌ను కీపింగ్ చేయాల్సిందిగా సూచించాడు.

రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సర్ఫరాజ్ మొదటి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. చివర్ ఓవర్‌ను కూడా తనే వేసిన అహ్మద్‌‌కు జింబాబ్వే బ్యాట్స్‌మెన్ పీటర్ మూర్ షాకిచ్చాడు. మిడ్ వికెట్ మీదుగా అతను భారీ సిక్సర్ కొట్టి అభిమానులను అలరించాడు.. మొత్తం మీద రెండు ఓవర్లు కలిపి సర్ఫరాజ్‌ 15 పరుగులు ఇచ్చాడు.

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోని  2009లో జోహెన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా తీశాడు. ఇప్పుడు అభిమానులు ధోనీకి, సర్ఫరాజ్‌కి పోలిక పెడుతూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. పాక్ కెప్టెన్ ధోనీలా బౌలింగ్ చేయగలిగాడు కానీ.. వికెట్ తీయలేకపోయాడని కామెంట్లు పెడుతున్నారు. 
 

loader