ఐపీఎల్ 2019 ఫీవర్ ముగిసింది. ఐపీఎల్ కప్...రోహిత్ శర్మ సారధ్యంలో ముంబయి ఇండియన్స్ అందుకుంది. ఒక్క పరుగు తేడాతో... చెన్నై సూపర్ కింగ్స్ కప్ చేజార్చుకుంది. కాగా... ఈ మ్యాచ్ గురించి పక్కన పెడితే... కామెంటేటర్ మంజ్రేకర్ ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.  మంజ్రేకర్ కామెంటేటరా లేక.. ముంబయి ఇండియన్స్ కి సలహా దారుడా అంటూ.. ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే...  ఆదివారం సాయత్రం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా...ఐపీఎల్ ఫైనల్స్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. కాగా...  తొలుత టాస్ గెలిచి ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ముంబయి ఓపెనర్లు.. తొలుత సిక్సర్లతో చెలరేగిపోయారు. 

కాగా.. తర్వాత.. మ్యాచ్ కాస్త చెన్నై సూపర్ కింగ్స్ కి అనుకూలంగా మారింది. వెంట వెంటనే ముంబయి ఇండియన్స్ బ్యాట్ మెన్స్ ఔట్ అయ్యారు. ఆ సమయంలో చెన్నై బ్యాట్స్ మెన్ లతో జాగ్రత్తగా ఉండాలంటూ.. మంజ్రేకర్ ముంబయి ఇండియన్స్ కి కామెంటరీ బాక్స్ నుంచే సూచనలు చేశాడు. ఈ సూచనలపై సర్వత్రా  వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

కామెంటేటర్.. కామెంటేటర్ లాగానే ఉండాలని... సలహాదారుడిగా ఉండకూడదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మంజ్రేకర్ పక్షపాత వైఖరితో ప్రవర్తించారని విమర్శిస్తున్నారు. ముంబయిని గెలిపించాలనే ఆత్రుత మంజ్రేకర్ లో కనిపించదని విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీ ఎలా స్పందిస్తాయో చూడాలి.