Asianet News TeluguAsianet News Telugu

సానియా మీర్జాకు షాక్..

వెంటనే తప్పుకోవాలి.. ఈ విషయంపై ప్రకటన ఇవ్వాలి

Sania Mirza Asked To Publicly Disassociate From "Misleading" Poultry Advertisement

టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఓ పౌల్ట్రీ( చికెన్) ప్రకటన ఇస్తున్న సంగతి అందిరికీ తెలిసిందే.  అయితే.. ఆ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ పేర్కొంది.

అడ్వైర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో సానియా మీర్జా అడ్వర్టైజ్మెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని.. ప్రమాణాలకు తగినట్టుగా లేదని తెలిపింది. బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్న సానియామీర్జా వెంటనే దాన్నుంచి తప్పుకోవాలని సూచించింది.

2014లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కోడిమాంసం ఉత్పత్తులపై ఇచ్చిన నివేదికను ఈ అడ్వైర్టైజ్మెంట్ అపహాస్యం చేసేట్టుగా ఉందని ఏఎస్‌సీఐ అధికారి తెలిపారు. దీనికనుగుణంగానే సానియామీర్జాను ప్రకటన నుంచి తప్పుకోవలసిందిగా ఆదేశించింది. అంతేగాక ఈ విషయమై బహిరంగ ప్రకటన చేయాలని సానియాకు సూచించారు.

ప్రకటనను మే 23లోగా ప్రకటనను వెనక్కి తీసుకోవాలి లేదా మార్పులు చేసి పునఃప్రసారం చేయాలని అఖిల భారత పౌల్ట్రీ రంగ అభివృద్ధి, సేవల సంస్థకు ఏఎస్‌సీఐ సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios