సచిన్‌కు నిద్రలో నడిచే అలవాటు.. ఆ రోజు రాత్రి భయపడిపోయా: సచిన్

Sachin Tendulkar was a sleepwalker: Ganguly
Highlights

భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలిలు అండర్- 15 నుంచి మంచి స్నేహితులు. ప్రపంచంలోనే విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఈ జంట మన్ననలు పొందింది. ఇన్నేళ్ల స్నేహంలో ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు

భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలిలు అండర్- 15 నుంచి మంచి స్నేహితులు. ప్రపంచంలోనే విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా ఈ జంట మన్ననలు పొందింది. ఇన్నేళ్ల స్నేహంలో ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఈ క్రమంలో మాస్టర్‌కు ఉన్న ఒక అలవాటు గురించి గంగూలి బయటపెట్టాడు. సచిన్‌కు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని తెలిపాడు.

‘‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’’ షో లో పాల్గొన్న గంగూలి తన క్రీడా జీవితం.. అనుభవాలను పంచుకున్నాడు..‘‘ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నామని ఆ సమయంలో సచిన్‌కు, నాకు ఒకే గది కేటాయించారు. ఓ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో అలికిడి అయితే లేచి చూశానని.. సచిన్ లేచి నడుస్తున్నాడని.. ఒకవేళ బాత్రూమ్‌కి వెళుతున్నాడేమోనని భావించి తాను నిద్రపోయానని.. అయితే రెండో రోజూ, మూడో రోజు కూడా నిద్రలో లేచి నడుస్తూనే ఉన్నాడని తెలిపాడు.

అసలు రాత్రుళ్లు అతడేం చేస్తున్నాడో తెలుసుకునేందుకు.. ఓ రోజు మెలకువతో ఉండి.. గమనించాడట.. ఆ రోజు రాత్రి 1.30 ప్రాంతంలో సచిన్ లేచి నడుస్తున్నాడు.. రూమంతా తిరిగి కుర్చీలో కూర్చొన్నాడని.. తర్వాత మంచం మీద నా పక్కకొచ్చి నిద్రపోయాడని చెప్పాడు. ఈ విషయం గురించి సచిన్‌ను అడిగాలని నిర్ణయించుకుని.. ‘‘రాత్రిపూట నన్ను భయపెట్టాలని చూస్తున్నావా’’ అని అడిగానని .. దానికి సచిన్ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పడంతో ఆశ్చర్యపోయానని గంగూలి నాటి జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నాడు. 

loader