మహీతో కలిసి నేను కూడా కొన్నేళ్లు క్రికెట్ ఆడాను.. ఆయన గురించి నాకు తెలుసు.. నా కెప్టెన్‌కు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదంటూ మాజీలకు చురకలు అంటిస్తూ తన కెప్టెన్‌కు మద్ధతుగా నిలిచాడు సచిన్

ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.. రెండో వన్డేలో అయితే మరి దారుణంగా బ్యాటింగ్ చేసి సీనియర్ల చేత విమర్శలకు గురయ్యాడు..ఇక మూడో వన్డే ముగిసిన తర్వాత అంపైర్ నుంచి బాల్ అందుకోవడంతో ధోనీ క్రికెట్ నుంచి శాశ్వతంగా రిటైర్ అవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. ధోనీ విఫలమవ్వడం వల్లే చివరి రెండు వన్డేల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైందని పలువురు అభిమానులు విమర్శించారు.

‘‘ధోనీ గౌరవంగానే తప్పుకుంటేనే మంచిదని... ఆడితేనే జట్టులో ఉంటావని ధోనీకి సూచించడం’’ పట్ల భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మండిపడ్డారు.. ధోనీ రాణించకపోయినా.. అతడిలో ఆడే సత్తా ఉంది... తనపై తనకు నమ్మకం ఉన్నంత కాలం ఆటగాడు ఆటలో కొనసాగవచ్చు.

ధోనీ ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించాడు. ఆటను ఇతరుల కంటే బాగా అంచనా వేస్తాడు. మహీతో కలిసి నేను కూడా కొన్నేళ్లు క్రికెట్ ఆడాను.. ఆయన గురించి నాకు తెలుసు.. నా కెప్టెన్‌కు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదంటూ మాజీలకు చురకలు అంటిస్తూ తన కెప్టెన్‌కు మద్ధతుగా నిలిచాడు.