Asianet News TeluguAsianet News Telugu

ఎవ్వరిని పట్టించుకోవద్దు.. పరుగులే నీ టార్గెట్..కోహ్లీకి సచిన్ అండ

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయానికి కొద్ది అడుగుల దూరంలో బొక్కబోర్లాపడటం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆడినప్పటికీ.. పుజారాను జట్టులోకి తీసుకోకపోవడం... ధావన్‌కు చోటు కల్పించడం తదితర అంశాలపై కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీలు

sachin tendulkar supports virat kohli

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయానికి కొద్ది అడుగుల దూరంలో బొక్కబోర్లాపడటం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగా ఆడినప్పటికీ.. పుజారాను జట్టులోకి తీసుకోకపోవడం... ధావన్‌కు చోటు కల్పించడం తదితర అంశాలపై కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు మాజీలు.. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... టీమిండియా కెప్టెన్‌కు అండగా నిలిచారు.

తొలి టెస్టులో విజయం చేజారినా.. కోహ్లీ పోరాటం ఆకట్టుకుందని ప్రశంసించాడు. విరాట్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు.. ఇది ఇలాగే కొనసాగాలి.. తన చుట్టూ ఏం జరుగుతుందనేది అనవసరం.. తన లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకరించాలి.. అతని మనస్సుకు అనిపించింది చేసుకుంటూ ముందుకు సాగాలి.

నా అనుభవం ప్రకారం చెబుతున్నా..ఇంకా పరుగులు సాధించు.. ఎక్కడా సంతృప్తి చెందకు.. బౌలర్లకు 10 వికెట్లు తీయాలని ఎలా ఉంటుందో.. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించాలని అలాగే ఉంటుంది.. అయితే బ్యాట్స్‌మెన్‌కు ఎన్ని పరుగులు చేసినా దాహం తీరదు.. కోహ్లీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌గా నువ్వు ఎప్పుడూ సంతోషపడు.. కానీ సంతృప్తి చెందకు అని సచిన్ సలహా ఇచ్చాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios