అన్నింటా ఆఖరి బంతి వరకు పోరాడినా అదృష్టం మొఖం చాటేసిన వేళ.. ఈసారి ముంబై ఇండియన్స్‌ జూలు విదిల్చింది. తొలి రెండు బంతులకే రెండు వికెట్లు కోల్పోయిన ఈ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 94)తో పాటు ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65) సూపర్‌ బ్యాటింగ్‌తో చిరుదరహాసం చేసింది. ఫలితంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అన్నింటా రాణించిన ముంబై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ స్కోరు ఛేదన కోసం దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. కోహ్లీ (62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. 

 

 

M14: MI vs RCB - Man of the Match - Rohit Sharma

Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates.