ఆస్ట్రేలియా సిరిస్కు ముందు భారత ఆటగాళ్లను సన్నద్దం చేసే ఉద్దేశ్యంతో సెలెక్టర్ పలువురు క్రికెటర్లను భారత్ ఎ జట్టులో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్ ఎ జట్టుతో జరిగే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా సీరిస్ కు సెలెక్టయిన ఆటగాళ్లకు మంచి ప్రాక్టిస్ లభిస్తుందని బిసిసిఐ భావించింది. అయితే మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఈ అనధికారిక టెస్ట్ జట్టు నుండి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ విశ్రాంతి తీసుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు భారత్ ఎ జట్టు న్యూజిల్యాండ్ ఎ తో తలపడనుంది. ఈ  మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా సీరిస్ కు ఎంపికైన రోహిత్ శర్మతో పాటు మరో ఐదుగురు ఆటగాళ్లను ఆడాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అసలు విరామం లేకుండా రోహిత్ చాలా మ్యాచ్ లు ఆడాడు. అలాగే ఈ నెల 21 నుండా ఆస్ట్రేలియాతో జరిగే టీ20లో పాల్గొనాల్సి ఉంది. కానీ న్యూజిల్యాండ్ ఎ తో జరిగే టెస్ట్ మ్యాచ్ 20 వ తేదీ  వరకు జరగనుంది. మధ్యలో విరామం తీసుకోడానికి అసలు సమయమే లేదు. 

అంతేకాకుండా రోహిత్ కు విశ్రాంతి చాలా అవసరమని బోర్డు వైద్య బృందం కూడా నివేదిక ఇచ్చింది. దీంతో అతడు అనధికారిక టెస్ట్ నుండి తప్పుకుంటూ నిర్ణయం  తీసుకున్నాడు. దీంతో రోహిత్ కూడా ఈ నెల 16వ తేదీనే అందరితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు.