ఆసియాకప్ 2023లో సూపర్ ఫోర్ లో టీమిండియా స్థానం సంపాదించింది. రెండో మ్యాచ్ గెలిచిన తరువాత మ్యాన్ ఆప్ ది మ్యాచ్ రోహిత్ శర్మ మాట్లాడారు.
ఆసియా కప్ 2023 మ్యాచ్లో టీమ్ ఇండియా సూపర్ ఫోర్ బెర్త్ ను ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అయిపోయిన తర్వాత మాన్ అఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ మాట్లాడుతూ…‘నా బ్యాటింగ్లో నిజంగానే మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. ఒక్కసారి రిథమ్ అందుకున్న తర్వాత…ఇక ఆగలేదు.. చివరి వరకు ఉండి మ్యాచ్ ఫినిష్ చేయాలని అనుకున్నాను. మంచి ఇన్నింగ్స్ ఆడడం చాలా సంతోషంగా ఉంది.
ఫ్లిక్ స్లీప్ షార్ట్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఆడలేదు. షార్ట్ ఫైన్ దిశగా ఆడాలని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా బ్యాట్ పవర్ కు బాలు బౌండరీ దాటింది. ఈ టోర్నీలో మా టీం రెండు లీగ్ మ్యాచ్లు ఆడింది. తొలి మ్యాచ్లో మాకు లక్కీగా బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింది. టాపార్డర్ విఫలమయింది. అయినా ఇషాన్, హార్దిక్ లు అద్భుతంగా రాణించారు.
ఆసియాకప్ 2023.. రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ..!
ఇక ఈ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి. బౌలింగ్, బ్యాటింగ్ రెండు చేశాం. మేము ఇంకా చాలా కష్టపడాలి. మా బాయ్స్ చాలామంది గాయాల నుంచి కోలుకొని తిరిగి వచ్చారు. వారు తిరిగి గాడిలో పడడానికి కొంత సమయం పడుతుంది. మ్యాచ్ గెలిచినప్పటికీ ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ నన్ను చాలా నిరాశపరిచింది. ఫీలింగ్లో మా టీం ఇంకా చాలా మెరుగు కావాలి. అలా చేయకపోవడం క్షమించరానిది..’ అన్నారు.
ఇక వరల్డ్ కప్ జట్టు విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఓ క్లారిటీ తోనే ప్రపంచ కప్ జట్టు శ్రీలంకకు వచ్చాం. ఆసియా కప్ లోని రెండు మ్యాచ్లతో ప్రపంచ కప్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయలేరు కదా...’ అన్నారు. సెలెక్టర్లు ఇప్పటికే ఈ మెగాటోర్నీ కోసం జట్టును ఫైనల్ చేశారని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోమవారం నేపాల్ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూపర్-4లోకి విజయవంతంగా అడుగు పెట్టింది. అయితే, టీమిండియా ఈ మ్యాచ్లో ఫీల్డింగ్, బౌలింగ్ పరంగా తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయింది.
భారత్ బ్యాటింగ్ లో మాత్రం ఇరగదీసింది. నేపాల్ మొదట బ్యాటింగ్ చేసి 230 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అదే సమయంలో వర్షం కురుస్తుండడంతో ఈ కారణంతో భారత లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులకు నిర్దేశించారు. దీంతో భారత్ రెచ్చిపోయింది. 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 147 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ లో ఓపెనర్లుగా ఉన్న రోహిత్ శర్మ శుభ్ మన్ గిల్ లు అదరగొట్టారు. రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 రన్లు నా టౌట్ గా నిలిచాడు. వీటిలో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక శుభ్ మన్ గిల్ 62 బంతుల్లో అరవై ఏడు గంటలు చేసి నాటౌట్ గా ఉన్నాడు. సుబ్రమణ్యం కూడా ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రోహిత్ శర్మతో జతకట్టి అజయంగా నిలిచి జట్టును గెలిపించారు.
