Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ ట్రోఫీ.. అసలు ఛాంపియన్ మలింగ : రోహిత్ కామెంట్

ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. 

Rohit Sharma Calls Lasith Malinga "Champion" After Mumbai Indians' 4th IPL Victory
Author
Hyderabad, First Published May 13, 2019, 9:59 AM IST

ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై... ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది.

కాగా... ఈ విజయంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హర్ష వ్యక్తం చేశారు. ఈ కప్ అందుకోవడం ముంబయి కి ఇది నాలుగోసారి. ఈ సీజన్ విజయం తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ లో బౌలర్ మలింగ ను రోహిత్ ఛాంపియన్ గా పేర్కొన్నాడు.

‘‘‘ముంబయి విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే.  20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపిచాను’’ అని రోహిత్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios