చాహల్ కు రోహిత్ శర్మ గమ్మత్తుగా జన్మదిన శుభాకాంక్షలు

Rohit Sharma Asks Yuzvendra Chahal To Find His 'Missing Tooth'
Highlights

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు రోహిత్ శర్మ గమ్మత్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ రోజు చాహల్ 28వ పుట్టిన రోజు.

ముంబై: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు రోహిత్ శర్మ గమ్మత్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ రోజు చాహల్ 28వ పుట్టిన రోజు.  వీరేంద్ర సెహ్వాగ్ శైలిని అనుకరిస్తూ రోహిత్ శర్మ చాహల్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు.

రోహిత్ శర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆ ట్వీట్‌పై స్పందిస్తున్నారు. "నీకు గొప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు, బ్రదర్. స్పిన్‌ బౌలింగ్‌తో నువ్వు ఇంకా రాణించాలి. నీ తొర్రిపన్ను(మిస్సింగ్ టూత్‌)ను కూడా కనుక్కుంటావని అనుకుంటున్నా" అని రోహిత్‌ శర్మ వెరైటీగా చహల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. 

వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో రోహిత్ ట్వీట్‌ చేసి హిట్టయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

loader