Asianet News TeluguAsianet News Telugu

మా అమ్మ, సోదరి కూడా నా స్లెడ్జింగ్‌ను ఇష్టపడ్డారు: పంత్

రిషబ్ పంత్...ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్‌లో పంత్ ఆస్ట్రేలియా జట్టుకు బ్యాట్ తోనే కాదు...నోటితోనూ సమాధానం చెప్పాడు. ఓ వైపు తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. అంతే కాకుండా తనను  రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ స్లెడ్జింగ్‌కు దిగిన ఆసిస్ ఆటగాళ్ళకు తనదైన శైలిలోనే రిషబ్ జవాబిచ్చాడు. దీంతో ఈ యువ ఆటగాడి  క్రేజ్ మరింత పెరిగింది. 

Rishabh Pant reveals his mother and sister enjoyed his sledging
Author
Hyderabad, First Published Jan 17, 2019, 5:55 PM IST

రిషబ్ పంత్...ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్‌లో పంత్ ఆస్ట్రేలియా జట్టుకు బ్యాట్ తోనే కాదు...నోటితోనూ సమాధానం చెప్పాడు. ఓ వైపు తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. అంతే కాకుండా తనను  రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ స్లెడ్జింగ్‌కు దిగిన ఆసిస్ ఆటగాళ్ళకు తనదైన శైలిలోనే రిషబ్ జవాబిచ్చాడు. దీంతో ఈ యువ ఆటగాడి  క్రేజ్ మరింత పెరిగింది. 

అయితే ఇలా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వారి శైలిలోనే ఆటతోనూ...మాటలతోనే జవాబివ్వడాన్ని అభిమానులు బాగా ఇష్టపడ్డారని పంత్ పేర్కొన్నాడు. ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ కు తనకు మధ్య  జరిగిన మాటల యుద్దాన్ని తన కుటుంబ సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేశారని తెలిపాడు. ముఖ్యంగా అతడి తల్లి, సోదరి ఈ స్లెడ్జింగ్ ను ఎక్కువగా ఇష్టపడ్డారని పంత్ వెల్లడించారు. 

అయితే తాను ఎక్కడా అసభ్య పదజాలాలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా స్లెడ్జింగ్ కు పాల్పడలేదని పంత్ గుర్తు చేశాడు. ఐసిసి నిబంధనలకు లోబడే తాను ఆరోగ్యకరమైన స్లెడ్జింగ్ కు పాల్పడినట్లు పేర్కొన్నాడు. తనను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోవడం తన నైజం కాదని...అందుకే ఆసిస్ కెప్టెన్ ఫైన్ కు మాటలతోనే జవాబిచ్చినట్లు పంత్ వివరించాడు. 

రిషబ్ తమ దేశ జట్టు సభ్యులతో స్లెడ్జింగ్ చేయడాన్ని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస‌న్ కూడా స్వాగతించిన విషయం తెలిసిందే.  న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఇరరు జట్టు సభ్యులకు విందు  ఇచ్చిన మోరిస‌న్...పంత్‌తో సరదాగా సంబాషించాడు. ఇలాంటి క్రీడాస్పూర్తితో కూడిన స్లెడ్జింగ్ ను తామెప్పుడూ ఆహ్వానిస్తూనే వుంటామంటూ రిషబ్ పంత్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios