Asianet News TeluguAsianet News Telugu

ఒక్క సెంచరీతో రికార్డులన్నీ చెల్లా చెదురు... ధోనీని వెనక్కునెట్టిన పంత్

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వీర విహారం చేశాడు. 125 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

rishabh pant breaks dhoni record
Author
England, First Published Sep 12, 2018, 11:37 AM IST

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వీర విహారం చేశాడు. 125 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో బ్యాటింగ్‌కు దిగిన పంత్.. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఆడుతోంది టెస్ట్ క్రికెటా లేక టీ20నా అన్నట్లు అతని ఆట సాగింది. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులతో సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు, సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ కోవలో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ(92) రికార్డును అధిగమించాడు.

అంతేకాదు సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసి.. తొలి టెస్టు సెంచరీని సిక్స్‌తో అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లోని నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌ కూడా రిషభే.. వికెట్ కీపర్‌గా సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడైన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. 

ఇంగ్లాండ్‌తో ఓటమి.. 10 పాయింట్లు కోల్పోయిన భారత్.. అయినా నెంబర్‌వన్ మనమే

కోహ్లీ మాట: ఓడినా మజా వచ్చిందట

భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్

Follow Us:
Download App:
  • android
  • ios