ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన భారత్‌ తన ఖాతా నుంచి 10 పాయింట్లు కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 115 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా 125 పాయింట్లతో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ 105 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే రెండోస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మనకు పాయింట్లలో చాలా వ్యత్యాసం ఉండటంతో భారత అగ్రస్థానానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

ఇక బ్యాట్స్‌మెన్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మొదటి స్థానంలో నిలిచాడు.

ఒక్క సెంచరీతో రికార్డులన్నీ చెల్లా చెదురు... ధోనీని వెనక్కునెట్టిన పంత్

కోహ్లీ మాట: ఓడినా మజా వచ్చిందట

భారత్‌కు దారుణ పరాజయాన్ని తప్పించిన రాహుల్-రిషబ్